Free Electricity : రేవంత్ రెడ్డి సర్కారుకు కరెంట్ షాక్.. 200 యూనిట్ల ఉచిత కరెంట్ హామీ కత్తి మీద సామేనా?
ప్రధానాంశాలు:
200 కంటే తక్కువ యూనిట్లకు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదా?
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీని ఎప్పుడు అమలు చేస్తుంది?
ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలు
Free Electricity : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 రోజులు అయింది. ఈ 10 రోజుల్లోనే తెలంగాణలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 10 రోజుల్లో కొత్త ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకుంది. అభయ హస్తం పథకం మీద సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం పెట్టారు. మహాలక్ష్మి పథకం కింద ఫ్రీగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా అందిస్తున్నారు. అయితే.. 6 గ్యారెంటీ హామీల్లో 200 యూనిట్ల ఉచిత కరెంట్ హామీని కూడా కాంగ్రెస్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎవ్వరూ కరెంట్ బిల్లులు కట్టొద్దని రేవంత్ రెడ్డి చాలాసార్లు ప్రచారాల్లో చెప్పుకొచ్చారు. అదొక్కటే కాదు. 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు.. రుణమాఫీ కావచ్చు.. ఇంకా వేరే పథకం కావచ్చు. చాలా పథకాలు కూడా తెలంగాణ ప్రజలను ఆకట్టుకున్నాయి.
అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 రోజులు దాటినా ఇంకా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేకపోయింది. అయితే.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను ఎవరికి ఇవ్వాలి.. అర్హత ఎలా నిర్ణయించాలి. పేదలకే ఇవ్వాలంటే.. పేదలను ఎలా నిర్ణయించాలి. విధి విధానాల రూపకల్పన ఎలా ఉంటుంది.. అనేది ఇంకా ప్రభుత్వానికి స్పష్టత లేదు. అయితే.. తమకు కరెంట్ బిల్లు కట్టొద్దని చెప్పడంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంట్ బిల్లులు కట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు.
Free Electricity : బిల్లులు కట్టకపోతే ఏమౌతుంది?
అయితే.. చాలామంది 200 యూనిట్ల కంటే కూడా తక్కువ కరెంట్ ను వాడుకునే వాళ్లు మాత్రం అస్సలు కరెంట్ బిల్లు కట్టేందుకు ఇష్టపడటం లేదు. ఎలాగూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా అందిస్తా అని చెప్పింది కదా.. అందుకే ఇక మేము కట్టం అని అంటున్నారు ప్రజలు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంకా ఉచిత విద్యుత్ హామీపై ఎలాంటి ప్రకటన రాకముందే ప్రజలు తమకు తామే డిసైడ్ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. మరి కొత్త ప్రభుత్వం ఈ హామీని ఎలా ముందుకు తీసుకెళ్తుందో వేచి చూడాల్సిందే.