USA : అమెరికాలోని వాషింగ్టన్ అవెన్యూలో కాల్పులు.. తెలుగు యువకుడు రవితేజ మృతి
ప్రధానాంశాలు:
USA : అమెరికాలోని వాషింగ్టన్ అవెన్యూలో కాల్పులు.. తెలుగు యువకుడు రవితేజ మృతి
USA : అమెరికాలోని వాషింగ్టన్ అవెన్యూలో జరిగిన కాల్పుల ఘటనలో ఒక తెలుగు యువకుడు మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన రవితేజ మృతి చెందాడు. హైదరాబాద్ చైతన్యపురిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నంబర్ 2 నివాసి కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజ .
USA : అమెరికాకు వెళ్లిన రవితేజ మాస్టర్స్ పూర్తి చేసి
2022 మార్చిలో అమెరికాకు వెళ్లిన రవితేజ మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. రవితేజ మరణంతో ఆర్కేపురంలోని ఆయన నివాసంపై విషాద ఛాయలు అలుముకున్నాయి. రవితేజ మరణం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నెల క్రితం సైతం జరిగిన కాల్పుల్లో తెలంగాణకే చెందిన మరొక విద్యార్థిని చనిపోయింది. యుఎస్‌లో తుపాకీ హింసలో భారతీయ విద్యార్థులు మరియు యువత పదే పదే మరణించడం ఆందోళనలను పెంచుతుంది .
Advertisement
WhatsApp Group
Join Now