Breaking: తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చిన కోర్టు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకే..!!
Breaking: మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణ రాజకీయాలను కుదిపేయడం తెలిసింది. అయితే ఈ కేసుకు సంబంధించి తాజాగా తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా హైకోర్టు చీఫ్ జస్టిస్ న్యాయస్థానం తీర్పు విలువరించింది. విషయంలోకి వెళ్తే ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకీ అప్పగించ వద్దంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగియటం జరిగింది.
ఈ క్రమంలో సిబిఐ చేత విచారణ జరిపించాలని నిందితులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంతి దావే వాదనలు వినిపించారు. ఇక ఇదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై తమకి నమ్మకం లేదని నిందితుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఇరువైపు వాదనలు వెన్న సీజే ధర్మాసనం గత నెల 30వ తారీఖున తీర్పును రిజర్వ్ చేసింది. కాగా ఈ కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం సమర్థిస్తూ…సీబీఐ విచారణకు ఓకే చెప్పడం జరిగింది. తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుకి తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది.