Viral Video : సభ్య సమాజం సిగ్గు పడే ఘటన.. సమయానికి రాని అంబులెన్స్.. నడిరోడ్డుపై ఆదివాసీ మహిళ ప్రసవం
Viral Video : మన దేశం, రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉందని జబ్బలు చరుచుకుంటున్నాం. చంద్రయాన్ 3 ని చంద్రుడి మీదికి పంపించామని మనమే గొప్ప అనుకుంటున్నాం. కానీ.. కనీసం ఆసుపత్రికి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తీసుకెళ్లేందుకు ఒక అంబులెన్స్ కూడా రాని దీన పరిస్థితుల్లో ఉన్నామని తెలుసుకోలేకపోతున్నాం. సభ్య సమాజం సిగ్గు పడే ఘటన ఇది. ఇది నిజంగా దారుణమైన ఘటన. నిర్మల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.పెంబి మండలం తులసిపేట్ మారుమూల గ్రామానికి చెందిన ఆదివాసీకి చెందిన మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో అంబులెన్స్ కు తన బంధువులు ఫోన్ చేశారు.
అసలు ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తనను స్థానిక ప్రజల సహకారంతో దొత్తి వాగు దాటించారు. అయితే.. రోడ్డు మీదికి వచ్చినప్పటికీ అంబులెన్స్ రాలేదు. అంబులెన్స్ కి ఎన్నిసార్లు కాల్ చేసినా డీజిల్ లేదని అంబులెన్స్ రాలేదు.మహిళను వాగు దాటించి అంబులెన్స్ కి కాల్ చేసినా 4 గంటలు అయినా రాలేదు. డీజిల్ లేదు.. అంబులెన్స్ ఇప్పుడు రాదు అని చెప్పడంతో మహిళ బంధువులు కంగు తిన్నారు.
Viral Video : 4 గంటలు అయినా మహిళ వద్దకు రాని అంబులెన్స్
చేసేది లేక రోడ్డు మీదనే ఆ మహిళకు ప్రసవం చేశారు. రోడ్డుపైనే మగ శిశువుకు జన్మనిచ్చింది ఆ మహిళ. నాలుగు గంటల పాటు రోడ్డు మీదనే ఆ మహిళ నరకయాతన అనుభవించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సభ్య సమాజం సిగ్గు పడేలా రోడ్డుపై ఆదివాసీ మహిళ ప్రసవం
నిర్మల్ – పెంబి మండలం తులసిపేట్ మారుమూల గ్రామానికి చెందిన ఆదివాసీ గర్భిణీ గంగమనికి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్సుకు ఫోన్ చేయగా ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక పోవడంతో.. స్థానిక ప్రజల సహకారంతో దొత్తి వాగు దాటించి… pic.twitter.com/j2IhmlvUPm
— Telugu Scribe (@TeluguScribe) August 25, 2023