Tummala : హస్తం వైపే అడుగులు.. ఖమ్మం సాక్షిగా తేల్చిన తుమ్మల?
Tummala : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఏది ఏమైనా.. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిందో అప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. టికెట్స్ దక్కుతాయి అని అనుకున్న కొందరు ఆశావహులు తమకు టికెట్స్ దక్కకపోవడంతో నిరాశ చెందారు. వెంటనే వేరే పార్టీల్లో చేరేందుకు ఆయా పార్టీలతో టచ్ లోకి వెళ్తున్నారు. ఇప్పటికే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. నకిరేకల్ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తా అని ప్రకటించారు.
ఆయనే కాదు.. చాలామంది టికెట్ దక్కని ఆశావహులు వేరే పార్టీల్లో టికెట్ హామీ వస్తే చేరేందుకు రెడీగా ఉన్నారు. అందులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. ఆయన ఈసారి తనకు పాలేరు నుంచి బీఆర్ఎస్ తరుపున టికెట్ దక్కుతుందని ఆశించారు. కానీ.. ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కాంగ్రెస్ నేతలు కూడా ఆయనకు టచ్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. తన అనుచరులతో ఆయన ఇప్పటికే పలుమార్లు భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై చర్చించారు.అయితే.. తుమ్మల కాంగ్రెస్ లో చేరబోతున్నారు అనే ప్రచారం ఖమ్మంలో జోరుగా సాగుతుండటంతో వెంటనే సీఎం కేసీఆర్ తుమ్మలను బుజ్జగించడానికి ఎంపీ నామా నాగేశ్వరరావును తుమ్మల ఇంటికి పంపించారు. తుమ్మలతో భేటీ అయిన నామా నాగేశ్వరరావు.. పార్టీలోనే ఉండాలని..
Tummala : కేసీఆర్ తరుపున తుమ్మలతో మాట్లాడిన ఎంపీ నామా
త్వరలోనే మంచి పదవి ఇస్తామని హామీ కూడా ఇచ్చారట. అయినా కూడా తుమ్మల మాత్రం బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు టికెట్ హామీ వస్తే కాంగ్రెస్ లో చేరేందుకు తాను రెడీ అనే సిగ్నల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతుండటంతో తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ప్రస్తుతం ఖమ్మ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.