Union Budget : దేశ ఉజ్వల భవిష్యత్ కు దిక్సూచి కేంద్ర బడ్జెట్ : ఏనుగు సుదర్శన్ రెడ్డి
ప్రధానాంశాలు:
Union Budget : దేశ ఉజ్వల భవిష్యత్ కు దిక్సూచి కేంద్ర బడ్జెట్ : ఏనుగు సుదర్శన్ రెడ్డి
Union Budget : ఫిబ్రవరి నెల 1 వ తేదీన ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ Union Budget పై హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఘాట్కేసర్ లో Ghatkesar మండల మరియు మున్సిపల్ అధ్యక్షులు బస్వరాజు గౌడ్,మహిపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బిజెపి BJP శ్రేణులతో కలిసి మోదీ గారి చిత్ర పటానికి పాలాభిషేకం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు మేడ్చల్ నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు..
Union Budget ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఒకవైపు సంస్కరణలు మరొకవైపు సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం .- ఇంకొకవైపు వేతన జీవుల టాక్స్ వెతలను దూరం చేసే విధంగా 12.75 లక్షల వరకు పన్ను రాయితీలను కల్పించడం ద్వారా దేశ ప్రగతి,భవిష్యత్ ను కొత్త పుంతలు తొక్కించే బడ్జెట్ గా దీన్ని ఆయన అభివర్ణించారు..
కానీ రాష్ట్రంలో కళ్ళుండి చూడలేని,అవినీతి కూపల్లో కూరుకుపోయిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ పై సన్నాయి నొక్కడం వారి అల్పబుద్ధికి నిదర్శనం కేంద్ర ప్రభుత్వ నిధులు సహకారంతోనే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి సంక్షేమం నడుస్తున్న విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు..