Hanuman Nagar : ఉప్పల్ హనుమాన్ నగర్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు..
ప్రధానాంశాలు:
Hanuman Nagar : ఉప్పల్ హనుమాన్ నగర్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు..
Hanuman Nagar : ఉప్పల్ హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉయ్యాల పాటలతో హనుమాన్ నగర్ కాలనీ మారుమోగాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడపడుచులు ఆడిపాడారు. గాజుల చేతుల చప్పట్లతో.. కాలనీ మారుమోగాయి. హరివిల్లు నేలపై పరుచుకుందా అన్నట్లుగా మహిళలు, యువతుల కేరింతలతో సందడిగా మారాయి.
గౌరమ్మను కొలుస్తూ జరుపుకున్న సద్దుల బతుకమ్మ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా చౌరస్తా బతుకమ్మలతో, ఆడపడుచులతోనూ మురిసిపోయాయి. మహిళామణుల పండుగగా పిలుచుకోనే బతుకమ్మలో సందడిగా ఆడిపాడుతున్నారు. 9 రోజుల ఈ వేడుకలో తంగేడు, జిల్లేడు, గునుగు, బంతి, చేమంతి ఇలా ఎన్నెన్నో కుసుమాలు ఈ పండుగ కోసమే పూశాయా అనిపిస్తాయి.
Hanuman Nagar హనుమాన్ నగర్ కాలనీలో బతుకమ్మ సంబురాలు
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గంటా రవీందర్ రెడ్డి , చీపురుపల్లి నాగరాజు, కోమటిరెడ్డి కృష్ణారెడ్డి , ఏనుగు మల్లారెడ్డి, తరువు రమేష్ , తోలుపునూరి నవీన్ గౌడ్ , పెద్ది అమరేందర్ రెడ్డి , ఎస్ కే ఖాసీం వలీ, ఇట్టి రెడ్డి రామచంద్రారెడ్డి , వి. కృష్ట , విజయ్ , తండు రాము గౌడ్ , గూదె సత్యయనారాయణ , కనికె శ్రీరాములు , పాల్గొనడం జరిగింది.