Uppal : ఉప్పల్ తిప్పల్ తీరినట్టే.. ఫలించిన పరమేశ్వర్ రెడ్డి కృషి
ప్రధానాంశాలు:
సీఎం, మంత్రి ఆదేశాలతో అర్థరాత్రినే ప్రారంభమైన పనులు
Uppal : ఉప్పల్ తిప్పల్ తీరినట్టే.. ఫలించిన పరమేశ్వర్ రెడ్డి కృషి
Uppal : ఉప్పల్ లో రోడ్డు తిప్పల్ తీరనుంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని రోడ్డు సమస్యకు చెక్ పడనుంది. రోడ్డు నిర్మాణం, గుంతల పూడ్చివేత పనుల ప్రారంభంతో ప్రజల ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

Uppal : ఉప్పల్ తిప్పల్ తీరినట్టే.. ఫలించిన పరమేశ్వర్ రెడ్డి కృషి
దీనికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చొరవతోనే సాధ్యమైంది. ఈ సమస్యను సీఎం, మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయించడంలో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి,మేడ్చల్ ఇంచార్జి వజ్రేష్ యాదవ్ గారి కృషి ఫలితంగానే సాధ్యమైంది.
Uppal పనులు పరిశీలించిన పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్ లో ప్రధాన రహదారిపై చేపట్టిన పనులను ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పరిశీలించారు.మంగళవారం అర్ధరాత్రినే రహదారి నిర్మాణం, మరమ్మతు పనులు ప్రారంభం అయ్యాయి. సంబంధిత విభాగాల అధికారులతో కలిసి పరమేశ్వర్ రెడ్డి పనులను పరిశీలించారు.