Revanth VS KCR : పిచ్చకుంట్లోడు కల్వకుంట్లోడు ఎవ్వడైనా రండ్రా.. రేవంత్ రెడ్డి సవాల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth VS KCR : పిచ్చకుంట్లోడు కల్వకుంట్లోడు ఎవ్వడైనా రండ్రా.. రేవంత్ రెడ్డి సవాల్

 Authored By kranthi | The Telugu News | Updated on :17 October 2023,4:17 pm

Revanth VS KCR : తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేశాయి. ఈనేపథ్యంలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ వాళ్లు, కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేతలు ఒకరిని మరొకరు తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలో రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య మాటల పోరు సాగుతోంది. ఇద్దరిలో ఎవ్వరూ అస్సలు తగ్గడం లేదు. మాటకు మాట అంటున్నారు. ఎట్లయితే కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ప్రచారం మొదలు పెట్టిన అన్నడో.. నేడు వికారాబాద్ గడ్డ నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రచారం మొదలు పెట్టిన. హుస్నాబాద్ నీకు అండగా నిలబడుతుందో.. వికారాబాద్ జల్లా నాకు అండగా నిలబడుతుందో చూద్దాం. మీరు ఆలోచన చేయండి. తెలంగాణ వచ్చి పదేళ్లు అయింది. గోదావరి జలాలు మనకు వచ్చాయా? మన రైతుల కష్టాలు తీరాయా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నావు.. 10 ఏళ్లు అయినా ఎందుకు ప్రాజెక్టులు ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి. ప్రభుత్వం ఒకరు ఉండి.. ఎమ్మెల్యే ఇంకొకరు ఉంటే నేను అభివృద్ధి చేయలేను అన్నడు. 5 ఏళ్లు అయింది.. మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా నీటి చుక్క కోసం ప్రయత్నం చేసిండా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కట్టడాన్ని ఎవ్వరు అడ్డుకున్నారు అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

war of words between revanth reddy and cm kcr

#image_title

Revanth VS KCR : ఎవరిని బంగాళాఖాతంలో వేయాలి?

ఎవరిని బంగాళాఖాతంలో వేయాలి.. ధరణినా లేక ధరణిని బంగాళాఖాతంలో వేసేవాళ్లనా? అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఓటును ఆలోచించి వేయండి. వాళ్లకు ఓటేస్తే మళ్లీ వీఆర్వోలు వస్తరు. నా భూమి ఇంకొకరికి ఇస్తరు.. ఇంకొకరు భూమి నాకు ఇస్తారు. వాళ్లు వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తరట. 3 గంటలే కరెంట్ ఇస్తే చాలట. మరి.. 3 గంటలు కరెంట్ ఇచ్చే వాళ్లకే మనం ఓటేద్దామా అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి మీరు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది