YS Sharmila : షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవ్వకుండా అడ్డుకుంటున్న ఒకే ఒక్క ఫ్యాక్టర్ ఇదే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Sharmila : షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవ్వకుండా అడ్డుకుంటున్న ఒకే ఒక్క ఫ్యాక్టర్ ఇదే !

YS Sharmila : ప్రస్తుతం తెలంగాణలో ఒకటే చర్చ. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ పార్టీ విలీనం గురించే. అసలు వైఎస్ షర్మిల పార్టీ పెట్టింది ఎందుకు.. పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకా. ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తోంది. అసలు ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినా ఇప్పటి వరకు తనకు సరైన రెస్పాన్స్ రాలేదు. తన పార్టీని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించినా ఫలితం ఉంటుందో లేదో.. కనీసం షర్మిల పోటీ చేస్తే తనను గెలిపించగలరా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :27 June 2023,1:00 pm

YS Sharmila : ప్రస్తుతం తెలంగాణలో ఒకటే చర్చ. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ పార్టీ విలీనం గురించే. అసలు వైఎస్ షర్మిల పార్టీ పెట్టింది ఎందుకు.. పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకా. ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తోంది. అసలు ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినా ఇప్పటి వరకు తనకు సరైన రెస్పాన్స్ రాలేదు. తన పార్టీని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించినా ఫలితం ఉంటుందో లేదో.. కనీసం షర్మిల పోటీ చేస్తే తనను గెలిపించగలరా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అందుకే తన పార్టీని వేరే పార్టీలో కలిపేయాలని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఆ వార్తలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ.. ఆ వార్తలను షర్మిల ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. కానీ.. లోపల మాత్రం పార్టీని విలీనం చేయాలనే భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే..

కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తే.. తను ఒక్క తెలంగాణకు మాత్రమే కాదు.. ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ తరుపున పని చేయాల్సి ఉంటుంది. అయితే.. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం తెలంగాణలో అవసరం లేదు.. ఏపీలో మాత్రమే షర్మిల కాంగ్రెస్ పార్టీ తరుపున పని చేయాల్సి ఉంటుంది.. అనే ప్రతిపాదనను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కానీ.. షర్మిల లక్ష్యం అది కాదు. ఆమె తెలంగాణ రాజకీయాల్లో రాణించాలని అనుకుంటున్నారు. తెలంగాణలోనే పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆమె ఏపీకి మళ్లీ వెళ్లి తన అన్న జగన్ కు వ్యతిరేకంగా ఎలా పనిచేస్తారు?ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ షర్మిల ద్వారా కాంగ్రెస్ పార్టీని ఏపీలో బలోపేతం చేసుకోవాలనేది కాంగ్రెస్ ప్లాన్. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

why sharmila is waiting to merge ysrtp with congress

why sharmila is waiting to merge ysrtp with congress

YS Sharmila : షర్మిలతో ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేసుకోవాలనేది ప్లాన్

మరోవైపు కాంగ్రెస్ ను వీడి వైఎస్ జగన్ ఏపీలో వైఎస్సార్సీపీ పార్టీని పెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఏపీని పాలిస్తున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే కష్టమే. అందుకే వైఎస్సార్ కూతురు షర్మిలను అడ్డు పెట్టుకొని ఏపీలో మళ్లీ అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ ప్లాన్. కానీ.. షర్మిల మాత్రం తెలంగాణలో పార్టీ పెట్టి.. తాను ఇక్కడే ఉంటాను అంటూ చెప్పుకొస్తున్నారు. షర్మిలను ఏపీకి తీసుకురావడానికి.. ఏకంగా కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ రంగంలోకి దిగారట. అయినా కూడా షర్మిల తెలంగాణను పట్టుకొని వదలడం లేదు అని అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది