Women : గుడున్యూస్‌.. మహిళల కోసం మరో ఫ్రీ పథకం తీసుకరాబోతున్న సీఎం రేవంత్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Women : గుడున్యూస్‌.. మహిళల కోసం మరో ఫ్రీ పథకం తీసుకరాబోతున్న సీఎం రేవంత్..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  గుడున్యూస్‌.. మహిళల కోసం మరో ఫ్రీ పథకం తీసుకరాబోతున్న సీఎం రేవంత్..!

Women : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తుచేస్తూ, త్వరలోనే మహిళల కోసం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేసే అవకాశం కల్పించేలా క్యూఆర్ కోడ్ ఆధారిత పథకం తీసుకురానున్నామని వెల్లడించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Women గుడున్యూస్‌ మహిళల కోసం మరో ఫ్రీ పథకం తీసుకరాబోతున్న సీఎం రేవంత్

Women : గుడున్యూస్‌.. మహిళల కోసం మరో ఫ్రీ పథకం తీసుకరాబోతున్న సీఎం రేవంత్..!

Women  తెలంగాణ లో హాస్పటల్స్ కూడా మహిళలతో నిండిపోబోతున్నాయి.. ఎందుకంటే

రైతు సంక్షేమంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రైతులకు ఇప్పటికే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని తెలిపారు. వారి భాద్యతను తమ భుజాలపై తీసుకుని ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడం కోసం ప్రభుత్వం ఏటా రూ.13 వేల కోట్లను వెచ్చిస్తున్నదన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రతి రైతుకి రూ.12 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. ఇది రైతుల భరోసా పెంపుకు, వ్యవసాయాన్ని మరింత ఉత్పాదకత గల రంగంగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందన్నారు.

ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్టు సీఎం తెలిపారు. ముఖ్యంగా సన్న వడ్లకు రూ.500 బోనస్ కల్పించడం ద్వారా అన్నదాతలకు నమ్మకాన్ని కలిగించామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 2.75 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతున్నదని వెల్లడించారు. రైతులు, మహిళలు, యువత ఈ మూడింటి సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది