Lord Shiva : శివుడి అనుగ్రహం పొందాలన్న, కోర్కెలు నెరవేరాలన్న ఈ రోజు ఈ విధంగా పూజించండి…!
Lord Shiva : శివుడిని మనస్ఫూర్తిగా పూజించడం వలన కోరుకున్న కోరికలు నెరవేర్చడమే కాకుండా ఆనందాన్ని శ్రేయస్సుని కూడా కలిగిస్తాడని నమ్మకం. సోమవారం అంటేనే శివయ్యకు అంకితం చేయబడిన వారం. బోలా శంకరుడి అనుగ్రహం కోసం భక్తులు సోమవారం నాడు ఓం ఓం నమః శివాయ అంటూ ఎన్నో విధాలుగా ఆరాధిస్తూ ఉంటారు. సోమవారం ఉదయం తెల్లవారుజామున నిద్రలేచిన తదుపరి శివున్ని దర్శనం చేసుకొని శివ చాలీసా లేదా శివాష్టికాన్ని జపించవచ్చు.. పరమశివుని భక్తిశ్రద్ధలతో పూజించడం వలన భక్తుల కోరికలు నెరవేరుస్తాడు. అలాగే జీవితంలోని ఎన్నో సమస్యలను కూడా పరిష్కరిస్తాడు. సోమవారం శివుని అనుగ్రహం పొందడానికి ఈనాడు కొన్ని పరిహారాలు గురించి తెలుసుకోబోతున్నాం..
దృష్టి దోషాలను పోగొట్టడానికి : ఆదివారం నైట్ పడుకునే ముందు మీ పక్కన ఒక గ్లాసు పాలను పెట్టుకుని నిద్రించాలి. దాని తర్వాత మరుసటి రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలను వేసుకొని గ్లాసులో పాలను ఏదైనా మొక్కకు పోయాలి. ఈ విధంగా చేయడం వలన దృష్టి దోషాలు పోతాయని నమ్మకం. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే : జాతకంలో చంద్రుని స్థితిని బలోపేతం చేయడానికి సోమవారం రోజు మీరు శివుడిని ఆరాధించేటప్పుడు ఉత్తర దిశలో కూర్చుని శివ రక్ష స్తోత్రం పాటించాలి. ఈ విధంగా చేయడం వలన విశ్వాసం అనేది పెరుగుతుంది. శివ పంచాక్షరి మంత్రాలను జపిస్తూ : సోమవారం ఉత్తరాభిముఖంగా కూర్చుని శివుడిని స్మరిస్తూ శివ పంచాక్షరి మంత్రం ఓం నమశివాయ యాబై ఒక్క సారి లేదా 108 సార్లు పట్టించాలి. దీని వలన శివుడు మరింత సంతోషించి కోరుకున్న కోరికలు అన్ని నెరవేరుస్తాడు.
డబ్బు ఇబ్బందులను పోగొట్టడానికి : మీరు మీ జీవితంలో ఏదైనా డబ్బు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే ప్రతి సోమవారం శివలింగానికి నీటితో పాలు కూడా సమర్పించాలి. అలాగే రుద్రాక్ష జపాలను పట్టుకొని ఓం సోమేశ్వరాయ అని 108 సార్లు చెప్పాలి. ఈ విధంగా చేయడం వలన అన్ని కష్టాలు తొలగిపోయి జీవితంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం కోసం : ఎవరైనా వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు అయినా వస్తున్నాయి అనుకుంటే వివాహానికి ఏదైనా అడ్డంకిని ఎదుర్కొన్నట్లయితే వారు సోమవారం ఉదయం శివాలయంలో గౌరీ శంకర్ రుద్రాక్షను సమర్పించాలి. స్వామివారికి తమ మనసులో కోరికను చెప్పుకోవాలి.. ఈ విధంగా చేయడం వలన ఆయన అనుగ్రహం తప్పక కలుగుతుంది. అలాగే కోరిన కోరికలను కూడా నెరవేరుస్తాడు..