YS Sharmila : కాంగ్రెస్ పార్టీ పెట్టిన కండీషన్స్ కి దండం పెట్టేసి నా వల్ల కాదు అని చెప్పేసిన వైఎస్ షర్మిల! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila : కాంగ్రెస్ పార్టీ పెట్టిన కండీషన్స్ కి దండం పెట్టేసి నా వల్ల కాదు అని చెప్పేసిన వైఎస్ షర్మిల!

 Authored By kranthi | The Telugu News | Updated on :4 July 2023,4:15 pm

YS Sharmila : ప్రస్తుతం తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ గురించే చర్చ. ఆ పార్టీ రాజకీయాలు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. సడెన్ గా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా అని ప్రకటించింది. దీంతో అందరూ లైట్ తీసుకున్నారు కానీ.. ఎప్పుడైతే వైఎస్సార్టీపీ పార్టీ పెట్టిందో అప్పుడు కానీ తెలంగాణ ప్రజలకు కాస్తో కూస్తో నమ్మకం వచ్చింది. కానీ.. ఇప్పుడు వైఎస్ షర్మిల తన పార్టీని కాస్త కాంగ్రెస్ లో కలపబోతున్నారట. అసలే ఎన్నికల సమయం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేయడం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు.

కానీ.. వైఎస్సార్టీపీ పార్టీని మెయిన్ టెన్ చేసేంత సత్తా కానీ.. అంత సామర్థ్యం కానీ వైఎస్ షర్మిలకు లేవు అని స్పష్టం అవుతోంది. మరోవైపు వైఎస్సార్టీపీ పార్టీ తెలంగాణ అంతటా పోటీ చేసే పరిస్థితులు లేవు. ఒకవేళ పోటీ చేసినా ఒక్క సీటు అయినా వస్తుందా అనేది నమ్మకం లేదు. వైఎస్ షర్మిల పోటీ చేసినా గెలుస్తుందా అనే నమ్మకం లేదు. ఇటువంటి నేపథ్యంలో వైఎస్ షర్మిల ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని అంతా వెయిట్ చేస్తున్నారు. అనుకున్నట్టుగానే ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారు అనే వార్తలు చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై షర్మిల కూడా ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ.. ఆమె వైఎస్సార్టీపీని ఒంటరిగా నడిపి ఏం చేయలేరు అని క్లారిటీ వచ్చినట్టు ఉంది.

ys sharmila gets conditions from congress party

ys sharmila gets conditions from congress party

YS Sharmila : కాంగ్రెస్ పెద్దలు ఏమంటున్నారు?

పార్టీ విలీనానికి కాంగ్రెస్ పెద్దలు కూడా ఒప్పుకున్నారట కానీ.. కొన్ని కండిషన్లు పెట్టారట. షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా ఆమెకు కొన్ని షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. ఆమెను తెలంగాణలో కాకుండా.. ఏపీకి పరిమితం చేయాలని భావిస్తున్నారట. ఎందుకంటే వైఎస్ షర్మిలది ఆంధ్రానే. ఆమె పుట్టి పెరిగింది కూడా అక్కడే. కానీ.. తెలంగాణ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల తనకు తెలంగాణ సిటిషన్ షిప్ వచ్చింది. అయినా కూడా తనకు ఎక్కువగా క్రేజ్ ఉన్నది ఏపీలోనే కాబట్టి తనను ఉపయోగించుకొని ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడాలనేది కాంగ్రెస్ పెద్దల ఆలోచన. కానీ.. అక్కడ అధికారంలో ఉన్నది మరెవరో కాదు.. షర్మిల అన్న జగన్. మరి.. షర్మిల.. తన అన్నకే పోటీగా అక్కడికి వెళ్లి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారా? ఆమె ఆలోచన ఏంటి అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది