Ys Sharmila : సోనియా గాంధీ కాల్ వ్యవహారంపై వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!
Ys Sharmila : YSRTP పార్టీ అధ్యక్షురాలు వైయస్సార్ షర్మిల పొలిటికల్ జర్నీ సంచలనం సృష్టిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో YSRTP పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జులై 8వ తారీకు వైయస్ జయంతి సందర్భంగా షర్మిల ఆరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ఇటీవల మీడియా సమావేశంలో కొంతమంది ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు వస్తున్న వార్తలపై షర్మిలని ప్రశ్నించారు. ఆమె స్పందించి ఎన్నికలు వస్తున్న సమయంలో రకరకాల పార్టీల నుండి ఆఫర్లు వస్తాయి. ఇదే రకంగా తనకి కూడా చాలా పార్టీల నుండి ఆహ్వానాలు అందుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఆఫర్స్ వస్తున్నట్లు పరోక్షంగా ఆమె హింట్ ఇచ్చేటట్లు మాట్లాడటం జరిగింది. ఇదిలా ఉంటే వైయస్ ఆత్మగా పిలవబడే కెవిపి రామచంద్రరావు సైతం వైఎస్ షర్మిలనీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి చురుకుగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరోపక్క కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీలు సైతం షర్మిల తో వైయస్ కుటుంబానికి దగ్గర అవటానికి ఇదే సరైన వేదిక అని సమయమని భావిస్తున్నారట. దీంతో జులై 8 వైయస్ జయంతి నాడు షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.