YS Sharmila : వైఎస్ షర్మిలకు షాకిచ్చిన వైఎస్సార్టీపీ నాయకులు.. పార్టీ ఆఫీసులో ధర్నా.. ఇంతకీ ఏమైందంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila : వైఎస్ షర్మిలకు షాకిచ్చిన వైఎస్సార్టీపీ నాయకులు.. పార్టీ ఆఫీసులో ధర్నా.. ఇంతకీ ఏమైందంటే?

 Authored By kranthi | The Telugu News | Updated on :3 November 2023,11:23 am

ప్రధానాంశాలు:

  •  షర్మిల ఎందుకు ఈసారి పోటీ చేయడం లేదు?

  •  షర్మిల పోటీ చేయకుండా అడ్డుుకన్నదెవరు?

  •  కావాలని షర్మిల ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారా?

YS Sharmila : వైఎస్సార్టీపీ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఆ పార్టీ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తమను మోసం చేసిందని మండిపడ్డారు. అసలు ఏం జరిగిందంటే.. త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పార్టీ పోటీ చేస్తుందని ముందు షర్మిల ప్రకటించారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. కానీ.. ఆ తర్వాత ఏమైందో కానీ.. కొన్ని స్థానాల్లోనే వైఎస్సార్టీపీ పోటీ చేస్తుందన్నారు. 50 స్థానాల్లో మాత్రమే పోటీ చేయునున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ తెలంగాణలో అసలు ఈసారి పోటీ చేయడం లేదంటూ షర్మిల ప్రకటించారు. దీంతో వైఎస్సార్టీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజానికి షర్మిల కూడా పాలేరు నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. తన తల్లి విజయమ్మ, భర్త అనిల్ కూడా పోటీ చేస్తారని అన్నారు. కానీ.. చివరకు షర్మిల కూడా ఈసారి పోటీలో లేనట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి వైఎస్సార్టీపీ పార్టీ పోటీలో లేదంటూ ఆమె తమ పార్టీ నాయకులతో చెప్పారట. దీంతో షర్మిల తమను మోసం చేసిందని నాయకులు పార్టీ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. వైఎస్సార్టీపీ నాయకులు, కార్యకర్తలను పావులుగా వాడుకొని ఇప్పుడు ఎన్నికల్లో పోటీ లేదంటూ ప్రకటించడం మోసం చేయడమే అని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల డౌన్ డౌన్.. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. అసలు పోటీలో ఉండనప్పుడు ముందు పోటీలో ఉంటామని ఎందుకు ప్రకటించారు. తమకు టికెట్లు లభిస్తాయని ఇన్ని రోజులు పార్టీ కోసం పని చేస్తే ఇప్పుడు ఇలా షర్మిల వ్యవహరించడం అస్సలు కరెక్ట్ కాదంటూ షర్మిలపై నాయకులు మండిపడుతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది