SS Rajamouli : మూవీ లాభాల్లో 30 శాతం రెమ్యూనరేషన్… దర్శకధీరుడు రాజమౌళి రేంజే వేరు
SS Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇది భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ. ఇందులో మన టాలివుడ్ స్టార్స్ గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించారు. ఇంకా అజయ్ దేవగణ్, ఆలియా భట్ వంటి బాలీవుడ్ స్టార్స్.. ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి వంటి హాలీవుడ్ స్టార్స్ నటించారు. మార్చి 25న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.అయితే ప్రస్తుతం జక్కన్న క్రేజ్ అంతా ఇంతా కాదు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు మన టాలీవుడ్‌కి స్టార్ డైరెక్టర్, దర్శక ధీరుడు రాజమౌళి నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నారు.
బాహుబలి తర్వాత జక్కన్న రేంజే మారిపోయింది. టాలీవుడ్ నుంచి ఆయన పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎదిగారు. రిసెంట్ గా రిలీజైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీకి కూడా వాయిస్ ఇచ్చారు.ఇప్పుడు రాజమౌళి తెరకెక్కించిన మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు హీరోలు, దర్శకుడు రెమ్యునరేషన్, జి.ఎస్.టి లేకుండానే ఈ సినిమా మేకింగ్‌కు రూ.336 కోట్లు అయినట్లు సమాచారం. రాజమౌళి ప్రాజెక్ట్ అంటేనే ఓ క్రేజ్ ఏర్పడుతుంది. ఆయన సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచి విడుదలైన సక్సెస్ అయ్యే వరకు ఆయన బిజినెస్ స్ట్రాటజీ వేరుగా ఉంటుంది. సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో భిన్నంగా ఆలోచిస్తూ ముందుంటారు. వైవిధ్యంగా సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే బాహుబలి సినిమా మొత్తంగా రూ.2300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టించింది.
SS Rajamouli : మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్..
ఇక రెమ్యునరేషన్స్, జీఎస్టీ అంతా కలుపుకుని ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యుండొచ్చని అంచనా.ఇందులో రాజమౌళి రెమ్యునరేషన్ లేదు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తల మేరకు రాజమౌళి సినిమా లాభాల్లో ముప్పై శాతం ఇవ్వాలని కండీషన్‌తో సినిమా స్టార్ట్ చేశారట. అంటే సినిమా రూ.2000 కోట్లు రాబట్టిందనుకుంటే అందులో సినిమా మేకింగ్ కోసం పెట్టింది రూ.500 కోట్లు అనుకుందాం. అవన్నీ పోగా లాభం రూపంలో రూ.1500 కోట్లు వస్తాయి. ఇందులో ముప్పై శాతం అంటే రూ.450 కోట్లు వరకు రాజమౌళికి రెమ్యునరేషన్ రూపంలో వస్తుందని అంటున్నారు. ఇంత మొత్తంలో మన ఇండియాలోనే ఏ డైరెక్టర్, స్టార్ హీరో రెమ్యునరేషన్ అందుకోవడం లేదనేది అందరికి తెలిసిన విషయమే…