Bhumana : భూమనకు ఎమ్మెల్సీ..ఈ సారికి నో టికెట్..వైసీపీ ప్లాన్ చేంజ్?
Bhumana : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు చూస్తుంటే అప్పుడే ఎన్నికల వాతావరణం దగ్గర పడినట్లు కనబడుతోంది. మొన్నటి వరకు వైసీపీ నేతలు, మంత్రులు జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రజెంట్ టీడీపీ, వైసీపీ నేతల మధ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే అధికార వైసీపీ నెక్ట్స్ ఎలక్షన్స్‌కు సంబంధించిన కసరత్తును స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.త్వరలో ఏపీ మంత్రి వర్గ విస్తరణ సందర్భంగా మొత్తం కేబినెట్ మారుస్తారనే ఊహాగానాలు వినబడుతుండగా, అందులో భూమన కరుణాకర్‌రెడ్డికి బెర్త్ దక్కుతుందా? అనే టెన్షన్ ఒక వైపున ఉండగా మరో వైపున వచ్చే సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరఫున భూమనకు టికెట్ కన్ఫర్మ్ అయ్యే చాన్సెస్ తక్కువే అన్న చర్చ నడుస్తున్నది.
ఇకపోతే ఆల్రెడీ గత ఎన్నికలే తన చివరి ఎన్నికలు భూమన పేర్కొనడం గమనార్హం. కాగా, భూమన తన వారసుడిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారని, వైసీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఇప్పటికే అధినేత జగన్‌ను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, భూమన అభ్యర్థను జగన్ తిరస్కరించారని కూడా తెలుస్తోంది.
తిరుపతిలో ఈ సారి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతనే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపాలని జగన్ యోచిస్తున్నట్లు వినికిడి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయిన భూమన కరుణాకర్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిపై కేవలం 700 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Bhumana : మంత్రివర్గంలో చోటు దక్కేనా?
టీడీపీ, జనసేన మళ్లీ జతకడితే వైసీపీ గెలుపు కష్టమవుతుందనే అంచనాలతో భూమనకు ఈ సారి టికెట్‌కు నో చెప్పినట్లు, ఎమ్మెల్సీగా పెద్దల సభకు పంపాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి.. వచ్చే ఎన్నికల వరకు ఏం జరుగుతోంది. అయితే, గతంలో తిరుపతి నుంచి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మెగాస్టార్ చిరంజీవి, వెంకట రమణ, సుగుణ, చదలవాడ కృష్ణమూర్తి వంటి వారు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.