Bhumana Karunakar Reddy : తిరుమల ప్రతిష్టతను దెబ్బతీస్తున్న కూటమి సర్కార్ – భూమన
ప్రధానాంశాలు:
Bhumana Karunakar Reddy : తిరుమల ప్రతిష్టతను దెబ్బతీస్తున్న కూటమి సర్కార్ - భూమన
Bhumana Karunakar Reddy : తిరుమల గోశాలలో నెలకొన్న పరిస్థితులపై టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గోవుల మృతి కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. గత మూడు నెలల్లో తిరుమల గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందాయని, అయినా ఆ విషయాన్ని ప్రభుత్వం బయటపెట్టకుండా రహస్యంగా ఉంచుతోందని భూమన ఆరోపించారు. తిరుపతిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ దారుణ పరిస్థితులకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటూ మండిపడ్డారు.

Bhumana Karunakar Reddy : తిరుమల ప్రతిష్టతను దెబ్బతీస్తున్న కూటమి సర్కార్ – భూమన
Bhumana Karunakar Reddy తిరుమల గోశాల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన భూమన
తమ పాలనలో దాతల సహకారంతో 500 గోవులను గోశాలకు తీసుకురావడం జరిగిందని, వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని భూమన గుర్తుచేశారు. కానీ ఇప్పుడు గోవులకు సరైన ఆహారం లేక, అవి మృతిచెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లేగదూడలు శ్రమిస్తుంటే చూసేవారే లేరని, చత్తికి వేసినట్లు ఆవులకు గ్రాసం వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది మానవత్వానికి మచ్చ వేసే ఘటనగా అభివర్ణించారు.
“భగవంతుడితో సమానమైన గోవుల పరిస్థితి ఇంత దారుణంగా మారింది. ఇది మానవ తప్పిదం కాదు, మాయాజాల పాలన ఫలితం” అని అన్నారు. గోవుల మృతిపై స్వరాష్ట్రంగా విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇప్పటివరకు పవన్ స్పందించకపోవడాన్ని కూడా ప్రశ్నించారు. తిరుమల ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు.