AP Politics : జగన్‌ను ఓడించేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మళ్లీ కలవబోతున్నారా..?
AP Politics : ఏపీ పాలిటిక్స్ ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ తెలీదు. అప్పటివరకు కూల్‌గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. అయితే. వచ్చే ఎన్నికల కోసం వైసీపీ పార్టీ, సీఎం జగన్ రెండేళ్ల ముందు నుంచే కసరత్తు ప్రారంభించారు. సీఎం జగన్ మరోసారి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకోవాలని భావిస్తున్నారట. దీంతో ఏ పార్టీతో పొత్తు లేకుండానే మరోసారి ఒంటిచేత్తో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ […]
AP Politics : ఏపీ పాలిటిక్స్ ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ తెలీదు. అప్పటివరకు కూల్‌గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. అయితే. వచ్చే ఎన్నికల కోసం వైసీపీ పార్టీ, సీఎం జగన్ రెండేళ్ల ముందు నుంచే కసరత్తు ప్రారంభించారు. సీఎం జగన్ మరోసారి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకోవాలని భావిస్తున్నారట. దీంతో ఏ పార్టీతో పొత్తు లేకుండానే మరోసారి ఒంటిచేత్తో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ పార్టీ చాలా పకడ్భందీ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. 2019లో ప్రయోగించిన ఫార్ములానే వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాట.
2019 ఎన్నికల ప్రచారంలో ఆది నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ‌్, చంద్రబాబు ఇద్దరూ ఒక్కటే అని.. పార్టీలు వేరైనా వీరి మధ్య రహస్య ఒప్పందం ఉందని వైసీపీ తెగ ప్రచారం చేసింది. పవన్‌ను టీడీపీ సీక్రెట్ ఫ్రెండ్‌గా ప్రజలను నమ్మించింది. వైసీపీ సోషల్ మీడియాతో పా0టు, జగన్ తన పాదయాత్రలోనూ ఈ విషయాన్ని పదే పదే నొక్కి చెప్పారు. పీకే టీం కూడా నెట్టింట చంద్రబాబు, పవన్ మధ్య రహస్య బంధాన్ని వైరల్ చేశారు. ఈ మాటలను నమ్మిన ఏపీ ప్రజలు ఇరు పార్టీలను చిత్తుగా ఓడించినట్టు తెలిసింది.
AP Politics : చంద్రబాబు, పవన్ ఎప్పటికైనా ఒక్కటే..
జనసేన అధినేత పవన్ కారణంగానే బీసీలు తమకు దూరమయ్యారని టీడీపీ పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది. కాపు, కమ్మ కాంబినేషన్ గత ఎన్నికల్లోవర్కౌట్ కాలేదని తెలుగు తమ్ముళ్లు భావించారు. అందువల్లే ఇటు పవన్, అటు చంద్రబాబు ఇద్దరూ నష్టపోవాల్సి వచ్చింది. వీరి నినాదం వలన కాపు, కమ్మలకు వ్యతిరేకంగా ఉన్న బీసీలంతా వైసీపీకి అండగా నిలిచారు. దీనిని గుర్తించిన చంద్రబాబు మరోసారి ఈ తప్పు చేయొద్దని నిర్ణయించుకున్నారని తెలిసింది. కానీ. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం అసలే లేదని తెలుస్తోంది. ఇప్పటికే జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోగా, ఏపీలో కాంగ్రెస్ ఊసే లేదు. మరి చంద్రబాబు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఏదేమైనా సీఎం జగన్ వ్యూహంతో జనసేన, టీడీపీకి గత ఎన్నికల్లో చెక్ పెట్టారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రజల మనస్సు మారొచ్చు. టీడీపీ, జనసేన మీద గల నెగెటివ్ అభిప్రాయం పోవచ్చు. అయితే, ఈసారి జగన్ ఎలాంటి వ్యూహంతో ఎన్నికల బరిలోకి దిగుతారని అంతా అనుకుంటున్నారు. ఒంటరిగా బరిలోకి దిగుతున్న జగన్ తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల మీదే ఆధారపడుతారా.. ప్రశాంత్ కిషోర్ సాయం మరోసారి తీసుకుంటారా.. ? అని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకును కాపాడుకుంటే మరోసారి జగన్ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.