huzurabad result..ఈట‌ల‌దే హుజూరాబాద్‌.. 23వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపు..

Authored By praveen T | The Telugu News | Updated on: November 2, 2021, 6:45 pm

huzurabad result..అంద‌రూ అనుకున్న‌ట్టే జ‌రిగింది. హుజూరాబాద్ ఓట్ల లెక్కింపులో ఈట‌ల రాజేంద‌ర్ ఘ‌న విజ‌యం సాధించింది. ఊహించిన దాని కంటే కూడా భారీ మెజార్టీ ద‌క్కింది. 22 రౌండ్ల‌లో టీఆర్ ఎస్ కేవ‌లం 8, 11 రౌండ్ల‌లో మాత్ర‌మే ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. మిగ‌తా అన్ని రౌండ్ల‌లో ఈటల రాజేంద‌ర్ ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించారు.

huzurabad result etala win in huzurabad

huzurabad result etala win in huzurabad

రౌండ్ రౌండ్ కు ఆధిక్యం పెర‌గ‌డంతో ఆయ‌న దాదాపు 23,865 ఓట్ల మెజార్టీతో సంచ‌ల‌న విజ‌యం సాధించారు. దీంతో వ‌రుస‌గా ఏడోసారి ఆయ‌న ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయ‌న‌కు ఈట‌ల రాజేంద‌ర్‌కు లక్ష‌కు పైగా ఓట్లు రావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లో కూడా ఈ స్థాయిలోనే ఓట్లు వ‌చ్చాయి.

huzurabad result etala win in huzurabad

huzurabad result etala win in huzurabad

దీంతో మ‌రోసారి ఆయ‌న గెలుపు పీఠంపై కూర్చున్నారు. గెల్లు శ్రీనివాస్ మీద ఈ స్థాయి మెజార్టీతో గెల‌వ‌డంతో బీజేపీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. ఇక అటు మ‌రికొద్ది సేప‌ట్లో ఈట‌ల రాజేంద‌ర్ ఈ గెలుపు మీద ప్రెస్ మీట్ పెట్టే అవ‌కాశం ఉంది. ఇక దీనిపై అటు టీఆర్ ఎస్‌కూడా వివ‌ర‌ణ ఇచ్చే అవ‌కాశం ఉంది.

praveen T

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp