huzurabad result..12రౌండ్లు ముగిసే స‌మ‌యానికి 6వేల ఓట్ల ఆధిక్యంలో ఈట‌ల‌.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

huzurabad result..12రౌండ్లు ముగిసే స‌మ‌యానికి 6వేల ఓట్ల ఆధిక్యంలో ఈట‌ల‌..

huzurabad result.. హుజూరాబాద్ ఓట్ల కౌంటింగ్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. మొద‌టి నుంచి ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తున్న ఈట‌ల రాజేంద‌ర్ మ‌రోసారి త‌న ఆధిక్యాన్ని నిల‌బెట్టుకున్నారు. అయితే తొమ్మ‌ది రౌండ్ల దాకా ఈట‌ల రాజేంద‌ర్ ఆధిక్యంలో ఉండ‌గా.. ప‌దో రౌండ్‌లో కూడా ఆయ‌న ముందంజ‌లో నిలిచారు. అయితే అనూహ్యంగా ప‌ద‌కొండో రౌండ్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ 353ఓట్ల ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇక‌పోతే ప‌న్నెండో రౌండ్‌లో మ‌ళ్లీ ఈటల ఆధిక్యంలోకి వ‌చ్చేశారు. బీజేపీకి ప‌దో రౌండ్లో 4235 […]

 Authored By praveen | The Telugu News | Updated on :2 November 2021,6:04 pm

huzurabad result.. హుజూరాబాద్ ఓట్ల కౌంటింగ్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. మొద‌టి నుంచి ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తున్న ఈట‌ల రాజేంద‌ర్ మ‌రోసారి త‌న ఆధిక్యాన్ని నిల‌బెట్టుకున్నారు. అయితే తొమ్మ‌ది రౌండ్ల దాకా ఈట‌ల రాజేంద‌ర్ ఆధిక్యంలో ఉండ‌గా.. ప‌దో రౌండ్‌లో కూడా ఆయ‌న ముందంజ‌లో నిలిచారు.

by the end of 12 rounds he was eading by 6000 votes

by the end of 12 rounds-he was eading by 6000 votes

అయితే అనూహ్యంగా ప‌ద‌కొండో రౌండ్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ 353ఓట్ల ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇక‌పోతే ప‌న్నెండో రౌండ్‌లో మ‌ళ్లీ ఈటల ఆధిక్యంలోకి వ‌చ్చేశారు. బీజేపీకి ప‌దో రౌండ్లో 4235 ఓట్లు వ‌చ్చాయి. కాగా టీఆర్ ఎస్‌కు 3709 ఓట్లు వ‌చ్చాయి. ఇక ప‌ద‌కొండో రౌండ్లో ఈట‌ల రాజేంద‌ర్ కు 3941 ఓట్లు రాగా టీఆర్ ఎస్‌కు 4308 ఓట్లు వ‌చ్చాయి.

by the end of 12 rounds he was eading by 6000 votes

by the end of 12 rounds-he was eading by 6000 votes

ఈ ఒక్క రౌండ్ లో టీఆర్ ఎస్ మ‌ళ్లీ ఆధిక్యంలోకి వ‌చ్చింది. ఇక ప‌న్నెండో రౌండ్‌లో మ‌ళ్లీ ఈటల రాజేంద‌ర్ స‌త్త్తా చాటారు. ఏకంగా 1217 ఓట్లు ఈ రౌండ్ లో ఆధిక్యం ప్ర‌ద‌ర్శించారు. మొత్తంగా ఈట‌ల‌కు 6547 ఓట్ల ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. ప‌న్నెండో రౌండ్ ముగిసే స‌మ‌యానికి ఈట‌ల రాజేంద‌ర్ భారీగా ఆధిక్యంలో ఉన్నారు.

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది