Puneeth Rajkumar : సినీ ఇండస్ట్రీలో విషాదం..కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు..

Authored By praveen T | The Telugu News | Published on: October 29, 2021, 2:36 pm

Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుకు గురయ్యారు. శుక్రవారం ఉదయం తన జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా, హార్ట్ అటాక్ వచ్చినట్లు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు పునీత్ రాజ్ కుమార్‌ను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకుని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఆస్పత్రికి తరలి వచ్చి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇంతలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకుని శాండల్ వుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

కన్నడ కంఠీరవ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రాజ్ కుమార్ తనయుడు అయిన పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం పట్ల అభిమానులు, కన్నడ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రేమద కనికే’ చిత్రంతో మాస్టర్ రాజ్ కుమార్‌గా శాండల్ వుడ్ ఎంట్రీ ఇచ్చిన పునీత్.. ఆ తర్వాత కాలంలో సూపర్ హిట్ చిత్రాలు చేసి పవర్ స్టార్‌గా ఎదిగారు. ఇటీవల ఆయన నటించిన ‘యువరత్న’ సినిమా ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలై సూపర్ సక్సెస్ అయింది.

praveen T

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp