Puneeth Rajkumar : పాపం పునీత్ భార్య.. భర్త మరణం నుండి కోలుకోకముందే మరో విషాదం
Puneeth Rajkumar : పేరుకి కన్నడ నటుడు అయిన దేశ వ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన హీరో పునీత్ రాజ్ కుమార్. కన్నడ పవర్ స్టార్‌గా పిలిపించుకున్న పునీత్ గత ఏడాది గుండెపోటుతో కన్నుమూసారు. ఆయన అకాల మరణాన్ని కన్నడిగులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతోమందికి సేవలను చేసిన అప్పుకు అభిమానులు గుండెల్లో గుడికట్టుకున్నారు. పునీత్ మరణించినప్పటి నుంచి ఆయనపై ఉన్న అభిమానాన్ని వివిధ రకాలుగా వ్యక్తిపరుస్తున్నారు. పునీత్ బాటలోనే మరికొందరు సామాజిక సేవా కార్యాక్రమాలు చేస్తున్నారు. అలాగే చాలా మంది ఫ్యాన్స్ 3D విగ్రహాలను తయారు చేయించుకుంటున్నారు.
అయితే పునీత్ మరణం మరవకముందే ఆయన భార్య అశ్విని కుటుంబంలో మరో మరణం సంభవించింది.దీంతో అశ్విని తీవ్ర విషాదంలోకి వెళ్లారు. పునీత్ రాజ్ కుమార్ మామ, అశ్విని తండ్రి రేవనాథ్ గుండెపోటుతో మరణించారు. కొద్దిసేపటి క్రితమే (ఫిబ్రవరి 20న) ఆయన మృతి చెందడంతో మరోసారి అశ్విని కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన బెంగళూరులోని M.S.రామయ్య హాస్పిటల్లో చికిత్స పొందుతూమరణించారు. కొన్ని నెలల క్రితమే గుండెపోటుతో పునీత్ మరణించడం, ఇప్పుడు పునీత్ మామ మరణించడంతో పునీత్ భార్య అశ్విని తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.

puneeth rajkumar father in law revanth passes away
Puneeth Rajkumar : మరో విషాదం.
ఈ అంత్యక్రియలకు పునీత్ కుటుంబ సభ్యులు కూడా హాజరు కానున్నారు.ఇక పునీత్ నటించిన చివరి సినిమా జేమ్స్ మార్చి 17న విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ పునీత్‌కి నివాళిగా ‘యువరత్న’ తో సహా ఐదు సినిమాలను ఫిబ్రవరి 1 నుండి 28 వరకు ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తుంది. అలాగే పునీత్ ప్రొడక్షన్స్ పిఆర్‌కె బ్యానర్ మీద నిర్మించిన ‘వన్ కట్ టూ కట్’, ‘ఫ్యామిలీ ప్యాక్’, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ సినిమాలను కూడా ఉచితంగా చూసే అవకాశం కల్పించింది అమెజాన్ ప్రైమ్.