Puneeth Rajkumar : సింప్లిసిటీకి కేరాఫ్ పునీత్ రాజ్ కుమార్.. ఇన్‌స్పిరేషనల్ జర్నీ..
Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం పట్ల శాండల్ వుడ్‌తో పాటు మిగతా సినీ పరిశ్రమలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. సినీ ప్రముఖులు, కన్నడ ప్రజలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ కంఠీరవ డాక్టార్ రాజ్ కుమర్ మూడో కుమారుడైన పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం పట్ల ప్రతీ ఒక్కరు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా, హీరోగా పునీత్ రాజ్ కుమార్ జర్నీ, సేవా కార్యక్రమాలు ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిదాయకం.పునీత్ రాజ్ కుమార్ కన్నడ, తెలుగు ప్రజలకు పవర్ స్టార్‌గా సుపరిచితం. కాగా, ఈయన సినిమా జర్నీ ప్రతీ ఒక్కరికి స్ఫూర్తి దాయకం. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తి ఏ విధంగా కష్టపడుతారో అదే మాదిరిగా పునీత్ చాలా కష్టపడ్డారు. మాస్టర్ రాజ్ కుమార్‌గా సిల్వర్ స్క్రీన్‌పై ఆయన పేరు తొలుత ఉండేది.
తర్వాత కాలంలో మాస్టర్ లోహిత్‌గా ఉండగా, ‘మౌర్య’ సినిమా తర్వాత పవర్ స్టార్ అయ్యారు. టాలీవుడ్ సినిమాలు కొన్నిటినీ కన్నడలో రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు పునీత్ రాజ్ కుమార్. ‘దూకుడు, ఆంధ్రావాలా, అభిమన్యుడు, ఇడియట్’తో పాటు పలు చిత్రాలు కన్నడలో రీమేక్ చేసి సూపర్ సక్సెస్ అయ్యాడు పునీత్ రాజ్ కుమార్. పదేళ్ల ప్రాయంలో ‘బెట్డాడ హోవు’ సినిమాలో రాము పాత్రను పునీత్ రాజ్ కుమార్ పోషించగా, ఆ సినిమాలో పునీత్ నటనకుగాను జాతీయ అవార్డు వచ్చింది. అప్పటి రాష్ట్రపతి జియాని జైల్ సింగ్ నుంచి అవార్డు అందుకున్నారు పునీత్. టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అప్పు’ ఫిల్మ్‌తో పునీత్ రాజ్ కుమార్ హీరోగా శాండల్ వుడ్ ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.
Puneeth Rajkumar : పదేళ్ల ప్రాయంలోనే నేషనల్ అవార్డు..
ఈ సినిమా రవితేజ ‘ఇడియట్’ సినిమా రీమేక్. కాగా, ‘వీరకన్నడ’ పేరిట రీమేక్ అయిన ‘ఆంధ్రావాలా’ చిత్రం కూడా బాగా సక్సెస్ అయింది. పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘యువరత్న’ చిత్రం కొవిడ్ లాక్ డౌన్ టైంలో ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది.