Electricity Bill : కరెంటు బిల్లును చూసి యజమాని షాక్.. ఏకంగా రూ.3 కోట్లు..
Electricity Bill : కరెంటు లేకుంటే మన ఇంట్లోనే కాదు సమాజంలోనూ చాలా పనులు ఆగిపోతుంటాయి. అందుకే కరెంటు లేని ప్రదేశమంటూ ఏమీ లేదు. అంతగా అవసరం ఉన్న విద్యుత్ ను పొదుపుగా వాడాలని ప్రభుత్వంతో పాటు అధికారులు సైతం చెబుతూ వస్తున్నారు. ఇక కొందరు తమ అవసరాన్ని బట్టి కొంచెం వాడటమా? లేదా కాస్త ఎక్కువగా వాడటమా? అనేది ఆధారపడి ఉంటుంది. ఇక ఓ అపార్టుమెంటుకు ఎంత బిల్లు వస్తుంది? నార్మల్ గా వాడితే రూ.150 నుంచి రూ.200 లోపు వస్తుంది.
ఇంకాస్త ఎక్కువగా వాడితే మరో వంద రూపాయలు పెరుగుతుంది. అంతే కానీ ఏకంగా రూ.3 కోట్ల బిల్లు వస్తే.. ఆ యజమాని పరిస్థితి ఏంటి? ఇదే జరిగింది మహబూబాబాద్ జిల్లాలో..మహబూబాబాద్ పట్టణంలోని ఓ అపార్టుమెంట్ యజమాని ఫిబ్రవరిలో తనకు వచ్చిన కరెంటు బిల్లును చూసి షాకయ్యాడు. కొత్త బజార్ లోని పులి గోపాల్ రెడ్డి నగర్‌లో ఒక అపార్టుమెంట్‌లో నాగేశ్వర రావు అనే వ్యక్తి సంవత్సరం క్రితం 302 నంబర్ ఉన్న అపార్టుమెంటును కొనుగోలు చేశాడు.
Electricity Bill : రూ.3 కోట్లు రావడంతో షాక్..
అతడు అమెరికాలో ఉంటుండటంతో పోర్షన్ ఖాళీగానే ఉంటుంది. నెలకు మినిమం రూ.175 వరకు కరెంటు బిల్లు వస్తోంది. తాజాగా ఫిబ్రవరి 14న విద్యుత్ సిబ్బంది బిల్లు తీశారు. అందులో ఏకంగా రూ.3 కోట్లా 21 లక్షలా 5 వేలా 218 వచ్చింది. దీనిని చూసిన సదురు ఇంటి యజమాని సోదరుడు ముందు షాక్ అయ్యాడు. తర్వాత ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశాడు. ఇక విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు అక్కడికి వచ్చారు. అంతా చెక్ చేసి సాకేంతిక లోపం వల్లే అలా జరిగిందని చెప్పారు. అనంతరం చెబుతూ బిల్లును సరిదిద్దారు. మరోసారీ మీటర్ రీడింగ్ ఆధారంగా రూ.175 బిల్లు వేశారు.