viral video : పాము నుండి కప్పను కాపాడిన చిరుత పిల్ల .. వీడియో
viral video..ఈ సువిశాల విశ్వంలో ఒక ప్రాణి తాను మనుగడను సాధించడం కోసం మరో ప్రాణిని చంపి ఆహారంగా తీసుకోవడం ఎప్పటి నుంచో వస్తుంది. ఇలాగే పాములు కప్పలను, ముంగీసలు పాములను చంపి తింటూ జీవనం సాగిస్తుంటాయి. ఇలాగే ఒక జూలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు తెగ వైరల్ గా మారుతోంది. ఈ వైరల్ అయిన ఘటనలో ఓ పాము, కప్ప, చిరుత ఉంటాయి. ఈ వైరల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియోను కొన్ని మిలియన్ల మందినెటిజన్లు చూశారు. 8 లక్షలకు పైచిలుకు మంది నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేశారు.
viral video..చంపి తిందామనుకుంటే..
snake Eat Frag but enter in leopard
పాములు కప్పలను తినడం సృష్టి ధర్మం. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ. అలాగే ఓ పాము జూలో ఉన్న ఓ కప్పను నోట కరుచుకుని తినేందుకు ప్రయత్నించింది. కానీ కప్ప మాత్రం పాము నుంచి తప్పించుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఇదే సమయంలో అక్కడికి చీతా ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన చీతా ఆ పామును చూసి ఎలాగైనా సరే పామును ఆహారంగా చేసుకోవాలని భావిస్తుంది. అనుకున్నదే తడవుగా తన కాళ్లతో పాము మీద ఒక్క సారి అడుగు వేస్తుంది.
దీంతో ఆ పాము చేసేదేం లేక చిరుత నుంచి తప్పించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఆ కప్ప హమ్మయ్య అనుకుని అక్కడి నుంచి చల్లగా జారుకుంటుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. పాముకు చీతా మంచిగా బుద్ది చెప్పిందని కొందరు కామెంట్లు చేయగా.. అల్పులను కష్టపెట్టాలని చూస్తే మనకు కూడా కష్టాలు వస్తాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను వెంటనే చూసేయండి.
View this post on Instagram