TRS : ఏపీలో టీఆర్ఎస్… ఎందుకోసం..? కేసీఆర్ వ్యూహం అదేనా?
TRS :తెలంగాణ సీఎం కేసీఆర్ రూటే సపరేటు.. ఆయన ఓ ఆలోచనను తెరపైకి తీసుకొచ్చారంటే దాని వెనకాల ఎన్ని వ్యూహాలుంటాయో ఎవరికీ అంతుచిక్కదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి దాదాపుగా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేను తన వైపు తిప్పుకుని ఆ పార్టీలను ఖాళీ చేశారు. ఇక ఏపీలోనూ పార్టీ పెట్టాలని తనకు విజ్ఞప్తులు వస్తున్నాయంటూ ప్లీనరీలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఇందులో అసలు ఎంత వరకు నిజం ఉందనే అంశంపై ఆయా పార్టీ్లో డిస్కషన్ స్టార్ట్ అయింది. కేసీఆర్ ఈ కామెంట్స్‌ను సీరియస్ కోణంలోనే చేశారా లేక పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు అలా మాట్లాడారా? అని చర్చ జరుగుతోంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పొరుగు రాష్ట్రంతో సీఎం కేసీఆర్ సత్సంబంధాలు కొనసాగించారు. జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకార ప్రోగ్రాంకు సైతం కేసీఆర్ అటెండ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్ సీఎం కావడానికి కేసీఆర్ ఇన్‌డైరెక్ట్‌గా హెల్ప్ చేశారనే టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. చాలా సార్లు చంద్రబాబు నాయుడును బహిరంగంగానే విమర్శించిన కేసీఆర్.. జగన్‌ను ఒక్కసారి కూడా తప్పుపట్టలేదు. కానీ తాజాగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనూ చర్చ జరుగుతుంది. దళితబంధు పథకాన్ని అక్కడ కూడా అమలు చేయాలని ఏపీ ప్రజలు కోరుతున్నారని.. ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెడితే గెలిపించుకుంటామని అక్కడి వారు చెబుతున్నారంటూ కేసీఆర్ ప్లీనరీలో హాట్ కామెంట్స్ చేశారు.
TRS : తప్పించేందుకా? ఇరికించేందుకా?
అయితే దళితబంధు పథకాన్ని ఏపీ సీఎం మెడకు చుట్టాలనే ఆలోచనతోనే కేసీఆర్ ఈ కామెంట్స్ చేశారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే టైంలో తెలంగాణలో వైసీపీ పూర్తిగా కట్టడి చేయాలని చూస్తున్నట్టు టాక్. ఏపీలో విపక్షాలతో సీఎం జగన్ అనేక ఇబ్బందులు పడుతుండటంతో ఆ ప్రాబ్లమ్స్ నుంచి జగన్‌ను తప్పించేందుకు సీఎం ఈ కామెంట్ చేశాడనే ఊహాగానాలు వస్తున్నాయి. ఎన్ని విధాలుగా చూసిన కేసీఆర్ కామెంట్స్ జగన్ కు పాజిటివ్ గా చేశారా? లేక నెగెటివ్ గా చేశారా? అనే డిస్కషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది.