వైరల్ వీడియో : ఒకే ఒక్క క్షణం ప్రాణాలు నిలబెట్టాడు.. నెటిజన్లు ప్ర‌శంస‌లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

వైరల్ వీడియో : ఒకే ఒక్క క్షణం ప్రాణాలు నిలబెట్టాడు.. నెటిజన్లు ప్ర‌శంస‌లు

కొన్ని కొన్ని సంఘటనలు కేవలం క్షణాల వ్యవధిలోనే జరిగిపోతుంటాయి. మనం స్పందించేలోపే ఊహించలేని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అలాంటి వీడియోలు ఎన్నో చూస్తున్నాం. కొన్ని కొన్ని వీడియోలు చూస్తే , నిజంగానే ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో జరిగిన సంఘటనలను చూస్తే నోట మాట కూడా ఆగిపోవటం ఖాయం. అలాంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. కేరళ లోని వడకర శాఖకు చెందిన ఒక […]

 Authored By brahma | The Telugu News | Updated on :20 March 2021,11:59 am

కొన్ని కొన్ని సంఘటనలు కేవలం క్షణాల వ్యవధిలోనే జరిగిపోతుంటాయి. మనం స్పందించేలోపే ఊహించలేని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అలాంటి వీడియోలు ఎన్నో చూస్తున్నాం. కొన్ని కొన్ని వీడియోలు చూస్తే , నిజంగానే ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో జరిగిన సంఘటనలను చూస్తే నోట మాట కూడా ఆగిపోవటం ఖాయం.

అలాంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. కేరళ లోని వడకర శాఖకు చెందిన ఒక బ్యాంకు మొదటి అంతస్తులో ఉంటుంది. అక్కడి బయట కారిడార్ లో ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. అందులో ఎర్ర చొక్కా ధరించిన వ్యక్తి ఉన్నట్లు ఉంది, ఒక్కసారిగా సృహతప్పి గోడపై వెనక్కి వాలిపోయాడు. దాదాపుగా అతను కింద పడిపోయాడు అనే అనుకోవచ్చు, ఆ సమయంలో పక్కనే ఉన్న వ్యక్తి, పడిపోతున్న వ్యక్తి కాలును బలంగా పట్టుకొని పైకి లాగే ప్రయత్నం చేశాడు .

viral video Kerala saved lives in a single moment

viral video Kerala saved lives in a single moment

దీనితో పక్కనే ఉన్న మరికొందరు వచ్చి పడిపోతున్న వ్యక్తిని పైకి లాగారు. ఆ వ్యక్తి అపస్మారక స్థితిలోకి జారిపోయి ఇలా భవనంపై నుంచి క్యూలో నిలబడి సృహ తప్పి పడిపోయాడని తెలిసింది. అపస్మారక స్థితిలో ఉన్న ఎర్ర చొక్కాలో ఉన్న వ్యక్తిని బిను అలియాస్ బాబుగా గుర్తించారు.రక్షించింది థాయిల్ మిట్టల్ బాబూరాజ్ అనే 45 ఏళ్ల వ్యక్తిని నెటిజన్లు ప్రశంసించారు. బాబురాజ్ ఒక వ్యక్తిని ఘోర ప్రమాదం నుండి రక్షించాడని అందరూ ప్రశంసించారు. ఇద్దరూ వడకరలోని కేరళ బ్యాంక్ శాఖకు వచ్చారని.. తమ సొమ్ము డిపాజిట్ చేయడానికి క్యూలో వేచి ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది