Batukamma : బతుకమ్మ చీరలు మాకొద్దని వెళ్లిపోయిన మహిళలు.. ఎక్కడంటే? .. వీడియో
Batukamma : 2017 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన యువతులు, మహిళలకు బతుకమ్మ సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్నది. పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున చీరలు అందిస్తున్నారు. కాగా ప్రభుత్వం అందించే చీరలు క్వాలిటీ లేవని అవి తమకు వద్దంటూ మహిళలు వెళ్లిపోయారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సదరు వీడియోలో ఓ మహిళా అధికారో లేదా ప్రజా ప్రతినిధో ఎవరో తెలియదు కాని ఆమె మాట్లాడుతూ ‘బలవంతం లేదు.. ఇష్టం లేనోళ్లు తీసుకోకండి.. దయచేసి ఈడి నుంచి వెళ్లిపోవచ్చు ఇంటికి వెళ్లిపోవచ్చు కూడా’ అని చెప్పింది. దాంతో అక్కడ కూర్చున్న మహిళలు వెళ్లిపోయారు.
ఈ క్రమంలో సదరు మహిళ మాట్లాడుతూ ‘ఆర్ఐ గారు.. ఈ చీరలన్ని కూడా ప్యాకప్.. మొత్తం ప్యాకప్ చేయండి’ అని అన్నది. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాదికిగాను రూ.333 కోట్లు విడుదల చేసి బతుకమ్మ చీరల కోసమే ఖర్చు చేసిందని, మొత్తం 30 డిజైన్లలో 20 కలర్స్‌లో బతుకమ్మ చీరలు వచ్చాయని అధికారులు చెప్తున్నారు.