Brahmamudi 8 Nov Today Episode : కావ్యను నమ్మని రాజ్.. ఎంత ఖర్చు పెట్టినా నాన్న బతకడు అని అన్న రుద్రాణి.. ఇద్రాదేవి సీరియస్.. ఇంతలో మరో ట్విస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Brahmamudi 8 Nov Today Episode : కావ్యను నమ్మని రాజ్.. ఎంత ఖర్చు పెట్టినా నాన్న బతకడు అని అన్న రుద్రాణి.. ఇద్రాదేవి సీరియస్.. ఇంతలో మరో ట్విస్ట్

Brahmamudi 8 Nov Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి 8 నవంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 248 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు మనస్ఫూర్తిగా కావ్యను భార్యగా అంగీకరించాలి అని రాజ్ తో అంటాడు సీతారామయ్య. నువ్వు కూడా నాలాగే ఈ ఇల్లు ముక్కలు కాకూడదని ఆలోచించావు అని కావ్యతో అంటాడు సీతారామయ్య. బావ ఈ అప్పగింతలు ఏంటి.. ముందు నువ్వు పదా, రెస్ట్ తీసుకొందువు కానీ […]

 Authored By gatla | The Telugu News | Updated on :8 November 2023,9:20 am

ప్రధానాంశాలు:

  •  కనకం, మూర్తిని తిట్టిన అపర్ణ

  •  కావ్యను నమ్మని రాజ్

  •  నా బావను ఎలాగైనా కాపాడుకుంటా అన్న ఇంద్రాదేవి

Brahmamudi 8 Nov Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి 8 నవంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 248 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు మనస్ఫూర్తిగా కావ్యను భార్యగా అంగీకరించాలి అని రాజ్ తో అంటాడు సీతారామయ్య. నువ్వు కూడా నాలాగే ఈ ఇల్లు ముక్కలు కాకూడదని ఆలోచించావు అని కావ్యతో అంటాడు సీతారామయ్య. బావ ఈ అప్పగింతలు ఏంటి.. ముందు నువ్వు పదా, రెస్ట్ తీసుకొందువు కానీ అని అంటుంది ఇందిరాదేవి. మరోవైపు కనకం, మూర్తి ఇద్దరూ కావ్య గురించి టెన్షన్ పడతారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అని కనకం టెన్షన్ పడుతుంది. దీంతో వెంటనే కావ్యకు ఫోన్ చేస్తుంది కనకం. ఏమైందమ్మా.. పెద్దాయన ఏమన్నారు అని అడుగుతుంది కనకం. ఏంటి కావ్య మాట్లాడవు. ఏమైనా అన్నారా? చెప్పవే. కావాలంటే నేను వచ్చి వాళ్ల కాళ్లు పట్టుకొని బతిమిలాడుతాను అంటుంది. దీంతో లేదమ్మా.. తాతయ్య మమ్మల్ని ఇక్కడే ఉండాలని చెప్పారు. అందరూ ఆ మాటకే కట్టుబడి ఉండాలని చెప్పారు. కానీ.. తాతయ్యకు క్యాన్సర్ అంట నాన్న అని చెబుతుంది కావ్య. దీంతో మూర్తి, కనకం షాక్ అవుతారు. ఇప్పుడు ఆఖరి స్టేజ్ లో ఉందని డాక్టర్ గారు చెప్పారట అంటుంది కావ్య. నాన్న.. నేను తర్వాత ఫోన్ చేస్తా. నా వల్ల అవడం లేదు.. అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది కావ్య. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మన అమ్మాయిల జీవితాలను నిలబెట్టాడు. అలాంటి మనిషికి ఇలా అవ్వడం ఏంటి అని అంటుంది కనకం. పదా.. మనం వెళ్లి ఒకసారి కలిసి వద్దాం అని అంటాడు మూర్తి.

మరోవైపు అనామిక.. కళ్యాణ్ కు ఫోన్ చేస్తుంది. ఏంటి సార్.. నిన్నటి నుంచి అస్సలు కాల్ లేదు.. ఏం లేదు.. ఏమైపోయారు అంటే ఇంట్లో కాస్త బిజీగా ఉన్నా అంటాడు కళ్యాణ్. అందుకే నేనే నీకు కాల్ చేశా అంటుంది అనామిక. మా డాడీ మీతో మాట్లాడాలని అంటున్నాడు అంటే దేనికి అంటాడు కళ్యాణ్. ఎందుకు అంటే.. మాట్లాడుకున్నాం కానీ.. పెళ్లి గురించి ఇతర విషయాలు మాట్లాడుకోవాలి కదా అంటే.. ఇప్పుడు వద్దులే అంటాడు కళ్యాణ్. తాతయ్యకు క్యాన్సర్ అని తెలిసింది. తర్వాత మాట్లాడుదాం అంటాడు. దీంతో సరే అంటుంది అనామిక. మరోవైపు అపర్ణ.. సుభాష్ పై సీరియస్ అవుతుంది. ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు దాచారు అని అడుగుతుంది. మామయ్య గారికి అలా అయిందంటే ఎలా తట్టుకుంటాం అంటుంది అపర్ణ. మీరు తట్టుకోలేరు కాబట్టే మీకు చెప్పకూడదని నేను, రాజ్ అనుకున్నాం అంటాడు సుభాష్. ఈ విషయం దాచి నాన్నను సంతోషంగా చూసుకోవాలని అనుకున్నాను అంతే అంటాడు సుభాష్. ఇంతలో కనకం, మూర్తి అక్కడికి వస్తారు. దీంతో వాళ్లను ఆగండి.. మళ్లీ ఎందుకు వచ్చారు అంటూ సీరియస్ అవుతుంది అపర్ణ.

Brahmamudi 8 Nov Today Episode : ముందు నువ్వు మారి.. ఇంట్లో వాళ్లను మార్చు అని అపర్ణపై సుభాస్ సీరియస్

అపర్ణ నువ్వు ఏం మాట్లాడుతున్నావు. నీకు కొంచెం అయినా సెన్స్ ఉందా అని అంటాడు సుభాష్. తప్పు మాదే. మేమే రాకూడని సమయంలో వచ్చాం. మేమే వెళ్లిపోతాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోబోతారు కనకం, మూర్తి. మీరు వెళ్లి మాట్లాడండి.. ఆగండి. ఇంత దూరం వచ్చారు. వెళ్లి నాన్న గారిని చూడండి అని అంటాడు సుభాష్. దీంతో వాళ్లు లోపలికి వెళ్తారు. ఇప్పుడే గొడవలు వద్దు అని చెప్పా. అయినా నువ్వు వాళ్లు రాగానే గొడవ పెట్టుకున్నావు. నువ్వు ముందు మారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లను మార్చేందుకు ప్రయత్నించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు సుభాష్.

మూర్తి, కనకం ఇద్దరూ ఇంట్లోకి వెళ్లగానే కావ్య కనిపిస్తుంది. పెద్దాయనను చూడటానికి వచ్చాం అంటాడు మూర్తి. నేను మొత్తం విన్నా నాన్న అంటుంది కావ్య. సరే అమ్మ.. మేము పెద్దాయనతో మాట్లాడి వస్తాం అంటారు. మరోవైపు సీతారామయ్య, ఇంద్రాదేవి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నా దగ్గర నిజం దాచి నన్ను బాధపెట్టి వెళ్లిపోదాం అని అనుకున్నావా బావ అంటుంది ఇంద్రాదేవి.

నువ్వు నన్ను వదిలి వెళ్లిపోతే ఇదే గదిలో ఏడుస్తూ ఒంటరిగా బతకాలి కదా అంటుంది ఇంద్రాదేవి. దీంతో అందరూ ఎప్పుడో ఒకప్పుడు వెళ్లిపోవాల్సిందే కదా అంటుంది ఇంద్రాదేవి. ఇంతలో కనకం, మూర్తి వస్తారు. వాళ్లను చూసి లోపలికి రండి అంటాడు సీతారామయ్య.

ఏంటి మావాడు మీకు కూడా ఫోన్ చేసి కంగారు పెట్టేశాడా? ఇప్పుడు ఏమైందని కంగారు పడుతున్నారు. మీ పిల్లలకు ఎలాంటి సమస్య రాదు. నేను మాటిస్తున్నాను అంటాడు మూర్తి. మీ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకోవడం తప్పితే మేము ఇంకేం చేయలేం అంటారు.

మీ కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి మా ఇంటికి పంపిన మరుక్షణం వాళ్లు ఈ ఇంటి పిల్లలు అని నేను ఆనాడే చెప్పాను అంటాడు సీతారామయ్య. దీంతో మేము వచ్చింది మీకోసం అంటారు. దీంతో నాకేంటి… గుండ్రాయిలా ఉన్నాను అంటాడు సీతారామయ్య.

మరోవైపు స్వప్న, రాహుల్ గొడవ పెట్టుకుంటారు. దానితో గొడవ ఎందుకు పెట్టుకుంటున్నావురా అని రుద్రాణి సీరియస్ అవుతుంది. నేను చెప్పేవరకు నోరు మూసుకొని ఉండు అంటుంది రుద్రాణి. నన్ను శత్రువులా చూడకండి అంటుంది కావ్య. తాతయ్య ఆరోగ్య పరిస్థితి ఇలా ఉందని నాకు తెలియదు అంటుంది కావ్య. దీంతో తెలిసి ఉంటే ఏం చేసేదానివి. నీ నాటకాన్ని ఇంకా బాగా ఆడేదానివి కదా అంటాడు రాజ్.

నా భర్త ప్రాణాలను మీరు నాకు కాపాడండి. నాకు దానం చేయండి. నేను సుమంగళిగా పోవాలని అనుకుంటున్నాను. ఎంత కష్టపడి అయినా.. ఎంత డబ్బు ఖర్చు పెట్టి అయినా నా బావను నేను కాపాడుకుంటా అంటుంది ఇంద్రాదేవి. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వేస్ట్.. బతకడం కష్టం అంటుంది రుద్రాణి. దీంతో ఇంద్రాదేవికి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది