Guppedantha Manasu 11 Nov Today Episode : శైలేంద్రకు మరోసారి షాక్ ఇచ్చిన వసుధార.. శైలేంద్ర, దేవయాని అసలు స్వరూపాన్ని రిషికి చెబుతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 11 Nov Today Episode : శైలేంద్రకు మరోసారి షాక్ ఇచ్చిన వసుధార.. శైలేంద్ర, దేవయాని అసలు స్వరూపాన్ని రిషికి చెబుతుందా?

Guppedantha Manasu 11 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 నవంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 918 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధార కోసం ఎంతో ప్రేమగా జుంకాలు తీసుకొస్తాడు రిషి. అవి పెట్టుకుంటూ ఉండగా ఒక జుంకా కింద పడుతుంది. దాని కోసం వెతుకుతూ ఉంటుంది వసుధార. కానీ.. అది కనిపించదు. ఇద్దరూ వెతుకుతూ ఉంటారు. వసుధారను కాసేపు ఆటపట్టిద్దామని రిషి ఆ […]

 Authored By gatla | The Telugu News | Updated on :11 November 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  ఏంజెల్, నన్ను చూస్తే నీకు ఏమైనా డౌట్ వచ్చిందా అని వసును అడిగిన రిషి

  •  రిషి మీద కోప్పడ్డ వసు

  •  రిషిని ఫోన్ లో ఆరోజు ఎటు వెళ్లారో కనుక్కోబోయిన శైలేంద్ర

Guppedantha Manasu 11 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 నవంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 918 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధార కోసం ఎంతో ప్రేమగా జుంకాలు తీసుకొస్తాడు రిషి. అవి పెట్టుకుంటూ ఉండగా ఒక జుంకా కింద పడుతుంది. దాని కోసం వెతుకుతూ ఉంటుంది వసుధార. కానీ.. అది కనిపించదు. ఇద్దరూ వెతుకుతూ ఉంటారు. వసుధారను కాసేపు ఆటపట్టిద్దామని రిషి ఆ జుంకా దొరికినా కూడా దాని జేబులో వేసుకుంటాడు. ఆ తర్వాత వసుధార.. నాకు దాన్ని వేసుకునే అదృష్టం లేదు సార్ అంటుంది. దీంతో నీకు ఎందుకు అదృష్టం లేదు.. ఇదిగో అంటూ రిషి దాన్ని వసుధారకు ఇస్తాడు. దీంతో సంతోషిస్తుంది వసుధార. మళ్లీ మనం మునుపటిలా రిషిధారలు అయ్యాం వసుధార అంటాడు. మన మధ్య ఇప్పుడు ప్రేమ తప్ప ఇంకేం లేదు. మన మధ్య దూరం వస్తే నేను భరించలేను వసుధార అంటాడు రిషి. సరే.. నేను జుంకాలు పెడతాను ఇవ్వు అని తన దగ్గర్నుంచి జుంకాలు తీసుకుంటాడు రిషి. దీంతో వసుధార చాలా సంతోషిస్తుంది. ఇక మన జీవితంలో ఊహలు ఉండకూడదు. అంతా మంచే ఉండాలి. అంతకుముందు నేను అనుకున్నది జరగాలి అంటాడు. మా డాడ్ మామూలు మనిషి కావాలి. మా అమ్మను చంపిన శత్రువును నేను పట్టుకోవాలి అని అంటాడు. దీంతో మీరు మళ్లీ ఎండీ సీటులో కూర్చొంటారు కదా. ఎండీగా బాధ్యతలు తీసుకుంటారు కదా అంటే నేను ఎప్పుడూ నీ ఎండీనే వసుధార అంటాడు రిషి. ఏది ఫేస్ చూసి చెప్పు.. నేను నీ ఎండీని కాదా అంటాడు. దీంతో వసుధార సిగ్గుతో అక్కడి నుంచి వెళ్తుంది.

మరోవైపు అనామిక.. విశ్వం దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ నీకు ఏ ఇబ్బంది లేదు కదా అంటే.. అదేం లేదు డాడ్ అంటుంది అనామిక. డాడ్.. నేను మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను అంటుంది. నేను ఒక ఫంక్షన్ చేయాలని అనుకుంటున్నాను అంటుంది. మా పాత విద్యార్థులతో అల్యూమీ ఫంక్షన్ చేయాలని అనుకుంటున్నా అంటుంది. మీరేమంటారు అంటే.. అందులో నేను అనేదేముంది అంటాడు. సడెన్ గా నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే.. నా ఫ్రెండ్స్ ను కలవక చాలా రోజులు అయింది. అందుకే.. చేయాలని అనుకుంటున్నా అంటుంది. మన ఓపెన్ ప్లాట్స్ లో చేయాలని ఉంది అంటుంది. దీంతో నీ ఇష్టం.. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు అంటాడు. నువ్వు ఇప్పుడే ఓకే అంటే నా బిజినెస్ మొత్తం నీకే అప్పగిస్తా.. నువ్వే చూసుకోవాలి అంటాడు. దీంతో ఈ మాట ఎప్పుడో చెప్పారు. మళ్లీ అదే మాట చెబుతున్నారు అంటుంది అనుపమ. మరోవైపు రిషి, వసుధార ఇద్దరూ సంతోషంగా ఉంటారు. వసుధార ఒడిలో పడుకుంటాడు రిషి. వసుధార నిన్ను ఒకటి అడగనా అంటాడు. దీంతో అడగండి సార్ అంటుంది. నేను, ఏంజెల్ నీకు బాగా తెలుసు కదా. మా ఇద్దరి మీద నీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? అని అడుగుతాడు.

Guppedantha Manasu 11 Nov Today Episode : రిషి సారీ చెప్పినా వినని వసుధార

దీంతో లేవండి సార్ అంటుంది వసుధార. అక్కడి నుంచి లేచి ముందుకు వెళ్తుంది. దీంతో వసుధార అంటాడు. ప్లీజ్ సార్ చేయి తీయండి అంటుంది. మీరు అడిగిన ఆ మాట నా మనసును ముక్కలు చేస్తోంది అంటాడు. సర్.. ఇదే మాట ఇంకొకరు అడిగి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది అంటుంది వసుధార. అసలు మీరు ఇలా ఎలా ఆలోచించారు. మీ మీద నాకు చచ్చేంత ప్రేమ తప్ప మరో ఉద్దేశం ఉండదు సార్. మిమ్మల్ని అనుమానిస్తే ఈ వసుధార అసలు వసుధార కానే కాదు సార్ అంటుంది వసుధార.

నిన్ను హర్ట్ చేశానా అని వెనుక నుంచి తనను పట్టుకొని సారీ వసుధార. సారీ చెబుతున్నాను కదా అంటాడు. దీంతో నాకు మీ సారీ ఏం వద్దు అంటుంది వసుధార. పోనీ శారీ కొనివ్వనా.. చెప్పు. ఎన్ని కావాలి అని అడుగుతాడు. దీంతో వసుధారకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. నీకు పది శారీలు కొనిస్తాను వసుధార. శారీ యాక్సెప్ట్ చేయవా అంటాడు. దీంతో నాకు మీ శారీ వద్దు.. సారీ వద్దు అంటుంది.

అయితే నువ్వు ఎలా యాక్సెప్ట్ చేయవో నేను చూస్తాను అంటాడు. మీరు ఏమైనా చేయండి.. నేను యాక్సెప్ట్ చేయను అంటుంది. ఎంతైనా పొగరు కదా.. చూడు ఏం చేస్తానో అని మంచం ఎక్కి గట్టిగా వసుధార ఐయామ్ సారీ అని చెబుతాడు. అయ్యో అరవకండి సార్.. అంటుంది. అయినా కూడా నేను యాక్సెప్ట్ చేయను అంటుంది. ఆ తర్వాత నువ్వు ఇలాగే ఉంటే.. నేను డాబా మీదికి వెళ్లి అరుస్తాను అంటాడు. దీంతో వద్దులే.. నేను యాక్సెప్ట్ చేస్తాను అంటుంది వసుధార.

మరోవైపు ఉదయమే ఫణీంద్రకు రిషి కాల్ చేస్తాడు. నేను లేనప్పుడు మీరు వచ్చి డాడ్ ను కలిశారు. నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు రిషి. నేను మీ డాడ్ ను ఇంటికి రమ్మని పిలిచినా రాలేదు. అందుకే తనను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అంటాడు. అప్పుడప్పుడు అలా వచ్చి డాడ్ ను పలకరించండి అంటాడు రిషి. దీంతో అది నా బాధ్యత అంటాడు ఫణీంద్ర.

ఇంతలో శైలేంద్ర, దేవయాని వస్తారు. ఎవరు డాడ్ అని అడుగుతాడు శైలేంద్ర. దీంతో రిషి అంటాడు ఫణీంద్ర. దీంతో ఇటు ఇవ్వండి నేను మాట్లాడుతా అని చెబుతాడు. బాబాయి మామూలు మనిషి అయ్యాడు. త్వరగానే మారుతాడు అంటాడు శైలేంద్ర.

ఆ తర్వాత మేము ఆరోజు వచ్చిన రోజు నువ్వు, వసుధార ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు. దీంతో ఇంతలో రిషి ఏదో చెప్పబోతుండగా అక్కడికి వచ్చిన వసుధార ఎవరు అని అడుగుతుంది. దీంతో శైలేంద్ర అంటే.. మిమ్మల్ని మామయ్య పిలుస్తున్నారు అని చెప్పి ఫోన్ తీసుకొని శైలేంద్రకు షాక్ ఇస్తుంది.

ఏం అడుగుతున్నారు రిషి సార్ ను. మీ గురించి మాకు బాగా తెలుసు అంటుంది వసుధార. ఆరోజు మీరు అందరూ వచ్చారు కానీ.. ధరణి మేడమ్ ను కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండేది అంటుంది. ఇంతలో దేవయాని ఫోన్ తీసుకొని నువ్వు భార్యాభర్తల గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది దేవయాని. దీంతో తను నా తోటి కోడలు. నేను జోక్యం చేసుకుంటాను. ఇక ముందు కూడా ఇలాగే జోక్యం చేసుకుంటాను. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ దేవయానికి వసుధార షాక్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది