Guppedantha Manasu 21 Nov Today Episode : మహీంద్రాను అనుమానించిన అనుపమ.. జగతి చావుకు మహీంద్రానే కారణమా? శైలేంద్ర కాదా? అనుపమకు అసలు నిజం తెలుస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 21 Nov Today Episode : మహీంద్రాను అనుమానించిన అనుపమ.. జగతి చావుకు మహీంద్రానే కారణమా? శైలేంద్ర కాదా? అనుపమకు అసలు నిజం తెలుస్తుందా?

Guppedantha Manasu 21 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 21 నవంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 926 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జగతి చావును నువ్వే కారణం మహీంద్రా. చెప్పు.. అసలు జగతిని నువ్వు ఎందుకు బాగా చూసుకోలేదు. నాకు ఇచ్చిన మాటను నువ్వు తప్పావు అంటూ మహీంద్రాపై విరుచుకుపడుతుంది అనుపమ. దీంతో మహీంద్రాకు కోపం వస్తుంది. నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు […]

 Authored By gatla | The Telugu News | Updated on :21 November 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  జగతిని నువ్వు ఎందుకు బాగా చూసుకోలేదు అని ప్రశ్నించిన అనుపమ

  •  దొంగచాటుగా వింటున్న శైలేంద్రను వసుధార చూస్తుందా?

  •  ధరణిని నమ్మించే ప్రయత్నం చేస్తున్న శైలేంద్ర

Guppedantha Manasu 21 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 21 నవంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 926 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జగతి చావును నువ్వే కారణం మహీంద్రా. చెప్పు.. అసలు జగతిని నువ్వు ఎందుకు బాగా చూసుకోలేదు. నాకు ఇచ్చిన మాటను నువ్వు తప్పావు అంటూ మహీంద్రాపై విరుచుకుపడుతుంది అనుపమ. దీంతో మహీంద్రాకు కోపం వస్తుంది. నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు అనుపమ అంటాడు. ఇంతలో రిషి, వసుధార అక్కడికి వస్తారు. అసలు అనుపమ.. మహీంద్రాతో ఏం మాట్లాడుతుందో తెలిసుకోవడం కోసం అక్కడికి వచ్చి చాటుగా వింటూ ఉంటాడు శైలేంద్ర. రిషి, వసుధార.. ఇద్దరూ అనుపమను చూస్తారు. మీరు ఎప్పుడు వచ్చారు అని అడుగుతారు. దీంతో ఇంతకుముందే వచ్చాను అంటుంది అనుపమ. కాఫీ తీసుకుంటారా అంటే.. కాఫీ మాత్రమేనా.. ఇంకేం లేదా? అంటే భోజనం చేసి వెళ్లండి అంటుంది వసుధార. ఇంతలో శైలేంద్రకు ఫోన్ రావడంతో తనకు ఫోన్ వచ్చిన సౌండ్ చేసి ఎవరు అని అనుకుంటుంది వసుధార. వెంటనే బయటికి వస్తుంది. ఇంతలో పక్కనే ఉన్న ఏదో కలర్ పూసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. తన బైక్ స్టార్ట్ కాదు. దీంతో నెట్టుకుంటూ వెళ్తాడు. రోడ్డు మీద ఓ మెకానిక్ చూసి ఏమైంది అంటే.. బైక్ స్టార్ట్ అవడం లేదు అంటాడు. కీ ఆన్ చేసి స్టార్ట్ చేయండి అంటాడు. దీంతో స్టార్ట్ అవుతుంది.

మరోవైపు రిషి, వసుధారతో మాట్లాడుతుంది అనుపమ. నువ్వు మీ అమ్మను ఎందుకు మేడమ్ అని పిలిచేవాడివి. కన్నతల్లిని నువ్వు మేడమ్ అని ఎందుకు పిలిచావు అంటే.. మేడమ్ అలా అనకండి నేను తట్టుకోలేను. అమ్మకు, నాకు మధ్య ఉన్న దూరం వల్ల.. నా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నేను అలా పిలవాల్సి వచ్చింది అంటే.. అలా అనకు రిషి. నువ్వు అలా మీ అమ్మను పిలవడం తప్పా కాదా.. అంటుంది అనుపమ. కన్న కొడుకుతో మేడమ్ అని పిలిపించుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా అంటుంది అనుపమ. దీంతో మేడమ్ నేను చేసింది తప్పే. అన్నీ మరిచిపోయి హ్యాపీగా ఉందామని అనుకుంటే ఇలా జరిగింది అంటాడు రిషి. మీ మాటలకు నేనే బాధపడుతున్నాను కానీ.. డాడ్ ఇంకెంత బాధపడతారో అని అనుకుంటాడు. దీంతో నేను మిమ్మల్ని బాధపెట్టడానికి రాలేదు. నా బాధ అంతా జగతి గురించే. తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేకపోతున్నాను రిషి అంటుంది అనుపమ.

Guppedantha Manasu 21 Nov Today Episode : అమ్మ విషయంలో నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పిన రిషి

అమ్మ విషయంలో మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఎప్పుడూ అమ్మను మరిచిపోను. తన మెమోరీస్ నా గుండెల్లో ఎప్పుడూ కదలాడుతూనే ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి అంటాడు రిషి. ఇంతలో వసుధార వచ్చి మేడమ్ కాఫీ కావాలా.. టీ కావాలా అంటే.. కాఫీ తాగుతాను.. నేనే కలుపుకుంటాను అంటుంది అనుపమ.

మరోవైపు ముఖానికి నల్ల రంగు పూసుకొని దానితోనే ఇంట్లోకి వస్తాడు. ఇంతలో ధరణి చూసి హేయ్ ఆగు.. ఇలా సరాసరి ఇంట్లోకి వచ్చేస్తున్నావు. ఎవరు నువ్వు అంటే.. ధరణిని నెట్టేసి ఇంట్లోకి వెళ్తాడు శైలేంద్ర. దీంతో నన్నే నెట్టేసి ఇంట్లోకి వచ్చేస్తావా అని ఇల్లు తుడిచే కర్ర పట్టుకొని వెళ్లి శైలేంద్రపై విరుచుకుపడుతుంది. అతడిని కొడుతుంది ధరణి. దీంతో నేను మీ ఆయనను అంటాడు శైలేంద్ర. అయ్యో.. దొంగ అనుకొని చితకబాదాను సారీ అంటుంది ధరణి.

అదేంటి ధరణి.. వెనుకా ముందు చూడకుండా అలా కొట్టేశావు అంటే… నేనేం చేయను అంటుంది ధరణి. నేను దొంగలా కనిపిస్తున్నానా? నాకు అర్థం అయిందిలే ధరణి. నిన్ను ఇన్ని రోజులు అన్నమాటలకు నా మీద ఇలా పగ తీర్చుకున్నావా అంటాడు. దీంతో అయ్యో మిమ్మల్ని అలా ఎందుకు అంటాను అంటుంది. సరే.. నేను స్నానం చేసి వస్తాను. నువ్వు రెడీ అవ్వు అంటాడు. ఎందుకు అంటే.. బైక్ పై నిన్ను తిప్పాలని ఉంది. అప్పుడే బైక్ పని చేస్తుందో లేదో అని చెక్ చేయడానికి వెళ్లాను. ఇలా అయ్యాను అంటాడు. దీంతో అవునా.. సారీ అండి అంటుంది ధరణి.

మా ఆయన నన్ను బయటికి తీసుకెళ్లాలని బాగా ఇబ్బంది పడినట్టున్నరు. కానీ.. నేనే ఆయన్ను గుర్తుపట్టలేకపోయాను.. పాపం అంటూ బాధపడుతుంది ధరణి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది