Intinti Gruhalakshmi 01 Dec Today Episode : తులసి టార్చర్ తట్టుకోలేక విషం తాగిన నందు.. చచ్చిపోతాడా? ఈ విషయం తెలిసి లాస్య ఏం చేస్తుంది.. ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?
Intinti Gruhalakshmi 01 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 01 డిసెంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 1116 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన రూమ్ లోనే కూర్చొని మందు తాగుతూ ఉంటాడు నందు. దీంతో పరందామయ్య, అనసూయ షాక్ అవుతారు. ఏంట్రా ఇంట్లోనే మొదలు పెట్టావా అంటారు. తులసి వస్తుంది రా లే అంటే.. వస్తే నాకేంటి భయం. నా మందు, […]
ప్రధానాంశాలు:
ఇంట్లోనే తాగడం మొదలు పెట్టిన నందు
ఇంట్లో మద్యం బాటిల్స్ చూసి తులసి షాక్
నందు ప్రవర్తన చూసి చచ్చిపోవాలని డిసైడ్ అయిన పరందామయ్య, అనసూయ
Intinti Gruhalakshmi 01 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 01 డిసెంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 1116 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన రూమ్ లోనే కూర్చొని మందు తాగుతూ ఉంటాడు నందు. దీంతో పరందామయ్య, అనసూయ షాక్ అవుతారు. ఏంట్రా ఇంట్లోనే మొదలు పెట్టావా అంటారు. తులసి వస్తుంది రా లే అంటే.. వస్తే నాకేంటి భయం. నా మందు, నా చిప్స్, నా మంచం, నా రూమ్ అంటూ వాగుడు వాగుతాడు. ఇంతలో అక్కడికి తులసి వస్తుంది. తాగాలని అనుకుంటే రోడ్డు మీద తాగి బొర్లమని చెప్పండి. కానీ.. ఇంట్లో కాదు. చిన్నపిల్లలు ఉన్నారని కూడా తెలియదా అంటూ తులసి సీరియస్ అవుతుంది. ఏదో ఈ ఒక్కసారికి వదిలేయమ్మా అని బతిమిలాడుతుంది అనసూయ. దీంతో ఈ ఒక్కసారే ఊరుకుంటున్నా? ఇంకోసారి ఇలాగే చేస్తే అస్సలు బాగోదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది తులసి. మరోవైపు వాడు నిన్ను ఇంత ఫోర్స్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని అంటాడు విక్రమ్ ప్రియతో. అబార్షన్ చేసుకోకపోతే వదిలేస్తా అన్నాడు అని ఏడుస్తూ చెబుతుంది ప్రియ. ప్రియ నువ్వు లోపలికి వెళ్లు అంటే.. ఎందుకు వెళ్లాలి. అందరి ముందు తన బాధ చెప్పుకోనివ్వు అత్తమ్మ. తనివితీరా ఏడవనివ్వు అంటుంది దివ్య. దీంతో విక్రమ్ తప్పు జరిగిపోయింది. సంజు కూడా బాధపడుతున్నాడు. ఇంతటితో ఈ ఇష్యు క్లోజ్ చేద్దాం. ఈ మాట దివ్యకు చెప్పు అంటుంది రాజ్యలక్ష్మి.
ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు. పోలీసులను చూసి అందరూ షాక్ అవుతారు. ఎస్ఐ గారు ఎవరు పిలిచారు మిమ్మల్ని అంటే.. నేను కంప్లయింట్ ఇచ్చాను సంజు మీద అని అంటుంది దివ్య. దీంతో ఇష్యూ సాల్వ్ అయింది కదా అంటుంది రాజ్యలక్ష్మి. విక్రమ్ మాట్లాడవేంట్రా అంటుంది. ఇష్యూ సెటిల్ అయింది ఎస్ఐ గారు అంటుంది రాజ్యలక్ష్మి. కానీ.. దివ్య వినదు లేదు ఎస్ఐ గారు. అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లండి అంటుంది దివ్య. ఎస్ఐ గారు ఒక్క నిమిషం ఆగండి.. విక్రమ్ నాతో రా. ఏంట్రా ఇది నీ తమ్ముడిని అరెస్ట్ చేయించడానికి దివ్య పోలీసులను ఇంటికి పిలిపించింది. నువ్వేమో సైలెంట్ గా ఉన్నావు. నీకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అంటే నిజంగా నాకు తెలియదు అమ్మ. పోలీసులను పిలిపిస్తున్నట్టు దివ్య నాకు చెప్పలేదు అంటాడు విక్రమ్. దివ్య చేసింది తప్పు కాదు కదా అమ్మ. నీ మనస్ఫూర్తిగా చెప్పు అమ్మ. తమ్ముడు చేసిన పని తప్పా కాదా అంటే.. తప్పే అంటుంది రాజ్యలక్ష్మి. మనమే మన ఇంటి మనిషిని క్షమించలేకపోతే ఇంకెవరు క్షమిస్తారు. నిన్ను పెంచినట్టే వాడిని కూడా పెంచాను. నా పెంపకంలో నువ్వు రాకుమారుడివి అయితే వాడు రాక్షసుడు అయ్యాడు అంటుంది రాజ్యలక్ష్మి. ఇప్పుడు నీ తమ్ముడు జైలుకు వెళ్తే ఇక్కడితో వాడి జీవితం నాశనం అవుతుంది. డాక్టర్ గా ప్రాక్టీస్ చేయలేడు. బయట ఎవరి ముందు తిరగలేడు. ఇంత విషం మింగి చావాల్సిందే. అది నీకు సంతోషమేనా అంటే.. తమ్ముడు బాధపడుతుంటే నాకెందుకు సంతోషంగా ఉంటుంది అంటాడు విక్రమ్.
Intinti Gruhalakshmi 01 Dec Today Episode : సంజును కాపాడాలని విక్రమ్ ను వేడుకున్న రాజ్యలక్ష్మి
మీ అమ్మ చేతులు జోడించి ప్రార్థిస్తోందిరా.. నీ తమ్ముడిని రక్షించమని.. అంటుంది రాజ్యలక్ష్మి. దీంతో అలా మాట్లాడకు నా చాలా బాధగా ఉంటుంది. నేను తట్టుకోలేను. వాడిని నేను ఎప్పుడో క్షమించేవాడిని కానీ.. వాడు అన్యాయం చేసింది ప్రియకు. మోసం చేసింది ప్రియను. తమ్ముడిని క్షమించే అర్హత, అవకాశం నాకు లేవు. ప్రియ తరుపున నేను నిర్ణయం తీసుకోలేను. నీతో పాటు తమ్ముడి గురించి బాధపడటం తప్ప నేను ఏం చేయలేను. నన్ను క్షమించమ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు విక్రమ్.
మరోవైపు విక్రమ్.. ఎస్ఐ గారు వెయిట్ చేస్తున్నారు అని అడుగుతుంది దివ్య. సంజయ్ ని తీసుకెళ్లడానికి ఎస్ఐ రెడీగా ఉన్నారు అంటుంది దివ్య. దీంతో సంజయ్ చేసింది తప్పే అంటాడు విక్రమ్. ఇలాంటి తప్పు ఇంకోసారి చేయను అని అంటున్నాడు కదా.. వాడిని క్షమించి వదిలేయమని అమ్మ అంటోంది అంటే నరకయాతన అనుభవించిన ప్రియ బాధ పట్టించుకోరా అంటుంది దివ్య. తన కష్టానికి, కడుపుకోతకు కారణం అయిన వాళ్లను కాలర్ ఎగిరేసుకునేలా తిరగమంటారా? అంటుంది దివ్య. దీంతో నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదని చెప్పాను అంటాడు విక్రమ్.
ప్రియ నేను మారాను.. అని సంజు చెప్పినా వినదు. దీంతో వెళ్లి ప్రియను బతిమిలాడుకుంటాడు సంజు. నన్ను క్షమించు అంటాడు సంజయ్. తన కాళ్లు కూడా పట్టుకుంటాడు. నన్ను క్షమించు ప్రియ. ప్లీజ్ క్షమించు ప్రియ అని బతిమిలాడుకుంటాడు సంజు. నా నిర్ణయానికి, నా ఇష్టానికి అవకాశం లేకుండా చేశారు. విలువ ఇవ్వలేదు. కానీ మీకు శిక్ష పడే విషయంలో దేవుడు నా నిర్ణయానికి విలువ ఇచ్చేలా చేశాడు అంటుంది ప్రియ.
కేవలం నా స్వార్థం కోసం మా ఆయన్ను క్షమిస్తున్నాను. అంతే తప్ప జాలితోనో ఆయన మారారన్న నమ్మకంతోనే కాదు అంటుంది ప్రియ. క్షమించినంత మాత్రాన అతడి తప్పు ఒప్పు కాకుండా పోదు కదా. అతడు నేరస్థుడు కాకుండా పోడు కదా అంటారు ఎస్ఐ. దీంతో ఒప్పుకుంటాను కానీ.. ప్రియ మీకు డైరెక్ట్ గా ఫిర్యాదు చేయలేదు.. హాస్పిటల్ లో ప్రియ సంతకం పెట్టినట్టుగా ఫైల్ లో ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మా ఫ్యామిలీ విషయంగా వదిలేయండి అంటాడు విక్రమ్. దీంతో ఆధారాలు సంపాదించడం ఎంతసేపు.. కాకపోతే ఇది ఇంకోసారి రిపీట్ చేయకండి అని చెప్పి పోలీసులు వెళ్లిపోతారు. ప్రియ వల్ల జైలు శిక్ష తప్పించుకున్నా.. ఈ ఇంటి శిక్షను తప్పించుకోలేవు. ఇక నుంచి హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదు అంటాడు విక్రమ్.
మరోవైపు ఉదయం లేవగానే పూజలు చేస్తూ ఉంటుంది తులసి. కానీ.. హాల్ లో ఎక్కడ చూసినా మద్యం బాటిల్స్ కనిపిస్తాయి తులసికి. దీంతో పరందామయ్య, అనసూయ వచ్చి వాటిని తీసేందుకు ప్రయత్నిస్తారు కానీ.. ఆగండి మామయ్య వద్దు.. ఆ బాటిల్స్ తీయకండి అంటుంది తులసి. ఈ ఇంట్లో మంచి చెడ్డా లేకుండా పోయింది అంటుంది. పెద్దా చిన్నా లేకుండా పోయింది అంటుంది. ఇంటి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు అంటుంది. కాసిన్ని పసుపు నీళ్లు తీసుకొచ్చి నా తల మీద చల్లండి అత్తయ్య అంటుంది తులసి. దీంతో సరే అంటుంది అనసూయ.
నన్ను క్షమించమ్మా అంటే.. ఎందుకు అత్తయ్య అంటుంది. దీంతో నా రక్తం పంచుకొని పుట్టిన వాడు కదా. నా వల్లే ఇదంతా అని అంటుంది అనసూయ. ఇంట్లో చిన్న పిల్ల ఉంది అని కూడా తెలియకుండా ఇలా చేస్తే ఎలా అంటుంది తులసి. దీంతో వాడిని ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెబుదాం అంటాడు పరందామయ్య. దీంతో అన్నీ తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటండి అంటుంది అనసూయ. మరోవైపు ఉదయం కూడా తాగుతాడు నందు. ఈ ఇంట్లో జరిగే ఘోరాలు మేము చూడలేంరా.. అని విషం ముందు పెట్టుకొని ఉంటారు పరందామయ్య, అనసూయ. దీంతో ఆ విషాన్ని తాగేస్తాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.