Intinti Gruhalakshmi 15 Dec Today Episode : పరందామయ్య దొరుకుతాడా? దివ్యను మళ్లీ పిచ్చిదాన్ని చేసిన రాజ్యలక్ష్మి.. పరందామయ్య వల్ల తులసి డిస్టర్బ్.. ఇంతలో మరో ట్విస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi 15 Dec Today Episode : పరందామయ్య దొరుకుతాడా? దివ్యను మళ్లీ పిచ్చిదాన్ని చేసిన రాజ్యలక్ష్మి.. పరందామయ్య వల్ల తులసి డిస్టర్బ్.. ఇంతలో మరో ట్విస్ట్

Intinti Gruhalakshmi 15 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 15 డిసెంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 1128 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పరందామయ్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ కు వెళ్లి తులసి, నందు ఫిర్యాదు ఇస్తారు. ఆయన అల్జీమర్స్ పేషెంట్ అని జాగ్రత్తగా ఉండాలి కదా. ఆయన దగ్గర ఫోన్ అయినా లేదా అడ్రస్ అయినా పెట్టాలి కదా అంటాడు పోలీస్. […]

 Authored By gatla | The Telugu News | Updated on :15 December 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  పరందామయ్య మెడలో చైన్ లాక్కోబోయిన దొంగ

  •  పరందామయ్యను తులసి కనుక్కుంటుందా?

  •  రాజ్యలక్ష్మి మరో గేమ్.. మరోసారి దివ్యను పిచ్చిదాన్ని చేశారు

Intinti Gruhalakshmi 15 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 15 డిసెంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 1128 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పరందామయ్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ కు వెళ్లి తులసి, నందు ఫిర్యాదు ఇస్తారు. ఆయన అల్జీమర్స్ పేషెంట్ అని జాగ్రత్తగా ఉండాలి కదా. ఆయన దగ్గర ఫోన్ అయినా లేదా అడ్రస్ అయినా పెట్టాలి కదా అంటాడు పోలీస్. ఇప్పుడు ఆయన దగ్గర ఏం లేవు. ఆయన కనిపించక 2 గంటలు అవుతోంది. వెంటనే వెతికి పెట్టండి అంటుంది తులసి. చూడండి మీ తప్పు వల్ల మీ భార్య ఎంత బాధపడుతుందో అంటాడు ఎస్ఐ. దీంతో నేను ఆయన భార్య అని ఎవరు చెప్పారు అంటూ సీరియస్ అవుతుంది తులసి. వామ్మో అంత కోపం ఎందుకు అని చెప్పి వెంటనే డిటెయిల్స్ తీసుకొని వెతకడం ప్రారంభిస్తాం అంటారు. ఆ తర్వాత చీకటి అవుతుంది. పరందామయ్య ఇల్లు కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఓ వ్యక్తి కనిపిస్తాడు. నీకు తులసి ఇల్లు తెలుసా అని అడుగుతాడు పరందామయ్య. దీంతో తెలుసు అంటాడు ఆ వ్యక్తి. పరందామయ్య కూడా ఆ వ్యక్తిని నమ్ముతాడు.

తులసి ఇంటికి తీసుకెళ్లు అంటాడు. కానీ.. ఆ వ్యక్తి పరందామయ్య మెడలో ఉన్న గోల్డ్ చైన్ చూస్తాడు. ఆ గోల్డ్ చైన్ చూసి అది నిజమైన గోల్డ్ చైనేనా అని అడుగుతాడు. దీంతో అవును అంటాడు. ఇక్కడ దొంగలు ఎక్కువగా ఉంటారు. ఆ గోల్డ్ చైన్ తీసి నాకు ఇవ్వు అంటాడు ఆ వ్యక్తి. వద్దు ఇవ్వను అంటాడు. దీంతో దాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో కారులో వెళ్తూ నందు, తులసి పరందామయ్యను చూస్తారు. వెంటనే ఆ వ్యక్తి పారిపోతాడు. ఇంటికి తీసుకొస్తారు. పరందామయ్యను ఇంటికి తీసుకురాగానే అనసూయ షాక్ అవుతుంది. నాకు అస్సలు మన ఇల్లు గుర్తుకురావడం లేదు. నాకు ఏమైనా అవుతోందా? నేను ఒక్కడినే ఎందుకు రోడ్డు మీద తిరుగుతున్నానో అర్థం కావడం లేదు అంటాడు పరందామయ్య. దీంతో పొరపాటు జరిగిపోయింది నాన్న. డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు మిమ్మల్ని ఒక్కరినే వదిలేసి డాక్టర్ దగ్గరికి వెళ్లాను అంటాడు నందు. దీంతో నాకు ఏమైంది. అసలు నన్ను ఎందుకు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లావు అంటాడు పరందామయ్య. ఏం లేదు మామయ్య. జనరల్ చెకప్ అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 15 Dec Today Episode : రాజ్యలక్ష్మి కింద పడిపోవడం చూసి దివ్య షాక్

మరోవైపు రాత్రి అవుతుంది. దివ్య పడుకుంటుంది. మధ్యలో నీళ్ల కోసం కిందికి వస్తుంది. కానీ.. కింద చూస్తే రాజ్యలక్ష్మి పడిపోయి ఉంటుంది. తనను చూసి భయపడుతుంది దివ్య. వెంటనే విక్రమ్ విక్రమ్ అంటూ అరుస్తుంది. ఏమైంది దివ్య. ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంటే.. అత్తయ్య అక్కడ పడిపోయింది అని చెబుతుంది. దీంతో వెంటనే విక్రమ్ కిందికి వస్తాడు. చూస్తే అక్కడ రాజ్యలక్ష్మి ఉండదు. వెంటనే అందరూ బయటికి వస్తారు. ఏమైంది అని అడుగుతారు. దీంతో నేను మంచినీళ్ల కోసం వచ్చాను. అత్తయ్య కింద పడిపోయింది ఉంది అంటుంది. ఇంతలో రాజ్యలక్ష్మి వస్తుంది. ఏమైంది అందరూ అర్ధరాత్రి ఇక్కడ ఉన్నారేంటి అంటే.. నీ పెద్ద కోడలు మళ్లీ సినిమా మొదలు పెట్టింది అంటాడు బసవయ్య. నువ్వు కింద పడిపోయావని చెప్పింది అంటాడు బసవయ్య. దీంతో విక్రమ్ కు ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే దివ్యను పైకి తీసుకెళ్తాడు విక్రమ్.

మరోవైపు పరందామయ్య పరిస్థితి గురించి తెలుసుకొని అనసూయ భయపడుతుంది. నందుతో తన బాధను చెప్పుకుంటుంది. ముసలితనం శరీరాన్ని బలహీనం చేస్తుంది. ముసలితనం పసితనంలా అందంగా ఉండాలంటే ఖచ్చితంగా మనోబలంతో ఉండాలి అని చెబుతుంది తులసి. ఇంతకంటే ఎక్కువ ఆశించకూడదు అని సర్దిచెప్పుకోవాలి. అది కష్టం అని నాకు తెలుసు. కానీ.. కష్టం అంటుంది తులసి. రాత్రి నాన్న గారు ఇబ్బంది పెట్టకుండా పడుకున్నారా అంటే.. ఆయన నన్ను ఇబ్బంది పెట్టడం కాదు.. ఆయన ఇబ్బంది పడటం చూడలేకపోతున్నాను అంటుంది అనసూయ.

మరోవైపు నందు అని పిలుస్తాడు. తనకు ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియదు. లుంగీ బదులు వేరేది వేసుకుంటాడు నందు. తులసి నీకు ఈ మధ్య బద్దకం ఎక్కువైంది. రాత్రి తలుపులు వేయడం మరిచిపోయావు అంటాడు పరందామయ్య. దీంతో వేశాను అంటుంది. దీంతో దొంగ ఎలా దూరుతాడు అంటాడు పరందామయ్య. ఒళ్లంతా నొప్పులుగా ఉన్నాయి అంటాడు పరందామయ్య. నడవడం కష్టంగా ఉంది అంటాడు. ఆ తర్వాత పరందామయ్య కాలికి దెబ్బ తాకడంతో ఆయనకు ఆయింట్ మెంట్ రాస్తుంది అనసూయ. ఈ మధ్య మీ అమ్మకు నా మీద ప్రేమ తగ్గిపోయిందిరా. నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు అంటాడు పరందామయ్య. మరోవైపు టైమ్ కు రెగ్యులర్ గా ట్యాబ్లెట్లు వేసుకోవాలని చెప్పి బీపీ ట్యాబ్లెట్ ఇస్తుంది అనసూయ. ఆ తర్వాత మరిచిపోయి మళ్లీ వేసుకుంటాడు పరందామయ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో తెలియాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది