Intinti Gruhalakshmi 17 Nov Today Episode : సరస్వతి నందు వల్లనే చనిపోయిందని తులసి ఏం చేస్తుంది? నందును అసహ్యించుకుంటుందా? ఇంతలో అసలు ట్విస్ట్ ఏంటంటే? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Intinti Gruhalakshmi 17 Nov Today Episode : సరస్వతి నందు వల్లనే చనిపోయిందని తులసి ఏం చేస్తుంది? నందును అసహ్యించుకుంటుందా? ఇంతలో అసలు ట్విస్ట్ ఏంటంటే?

Intinti Gruhalakshmi 17 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 17 నవంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 1104 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు 10 లక్షలు కట్టలేకపోతే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లండి అని చెబుతుంది డాక్టర్. మా అక్క ఫోన్ కలవడం లేదు.. మీరు ఆపరేషన్ చేయండి. మా అక్క ఫోన్ కలవగానే వెంటనే డబ్బులు కట్టేస్తాం అని దీపక్ […]

 Authored By gatla | The Telugu News | Updated on :17 November 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  శ్రీనివాస్ షేర్లు అమ్మకుండా కాపాడగలిగిన తులసి

  •  తులసిని క్యాండిల్ లైట్ డిన్నర్ కు తీసుకెళ్లిన నందు

  •  సరస్వతికి అంత్యక్రియలు నిర్వహించిన దీపక్.. సరస్వతి చివరి చూపు తులసి చూడగలుగుతుందా?

Intinti Gruhalakshmi 17 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 17 నవంబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 1104 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు 10 లక్షలు కట్టలేకపోతే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లండి అని చెబుతుంది డాక్టర్. మా అక్క ఫోన్ కలవడం లేదు.. మీరు ఆపరేషన్ చేయండి. మా అక్క ఫోన్ కలవగానే వెంటనే డబ్బులు కట్టేస్తాం అని దీపక్ ఎంత బతిమిలాడినా కూడా ఆ డాక్టర్ వినదు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లండి. ఎంత లేట్ చేస్తే ఆమె ప్రాణాలకు అంత ప్రమాదం అని అంటుంది డాక్టర్. దీంతో మీ అంబులెన్స్ ఇప్పించండి అని అంటాడు దీపక్. దీంతో సరే అంటుంది. మరోవైపు శ్రీనివాస్ ఇంటికి సాయంత్రం తులసి, నందు ఇద్దరూ వెళ్తారు. అక్కడ ముందే ఆర్కే ఉంటాడు. నువ్వు నాకంటే ముందు వచ్చి చక్రం తిప్పాలని అనుకుంటున్నావని నాకు తెలుసు. అందుకే నీ కంటే ముందే నేను వచ్చాను. రా కూర్చో అని అంటాడు ఆర్కే. ఇంకొంచెం సేపట్లో శ్రీనివాస్ గారు వస్తారు. మా ఇద్దరి డీల్ కళ్లారా చూసి పావనం అవుదువు గానీ అంటాడు ఆర్కే. తులసి గారు కదా.. కూర్చోండి అని అంటారు శ్రీనివాస్. సామ్రాట్ ఆఫీసులో పని చేస్తూ ఉండేవాళ్లు కదా. మీ గురించి మా వాడు చాలా గొప్పగా చెబుతూ ఉండేవాడు. మీ నిజాయితీని సామ్రాట్ మెచ్చుకునే వాడు. నువ్వు కూడా అతడితో పాటు బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ కు వస్తుండేదానివి కదా అంటాడు శ్రీనివాస్.

ఇంతలో శ్రీనివాస్ గారు.. ఒక టర్నింగ్ ఇచ్చుకొని ఇటువైపు చూస్తారా? ఆమె కంటే ముందు నేను వచ్చాను. అక్కడ కూర్చొని చూస్తున్నాను.. అంటూ చెప్పుకొస్తాడు ఆర్కే. అయ్యో నేను చూడలేదు ఆర్కే గారు అంటాడు శ్రీనివాస్. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను అంటుంది తులసి. ప్రస్తుతం సామ్రాట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి నేనే సీఈఓను అంటుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తుంది. కంపెనీ బాధ్యత సరైన చేతుల్లో పడింది అంటాడు శ్రీనివాస్. ఇక వెనక్కి చూసుకునే పని లేదు. సామ్రాట్ చాలా మంచిపని చేశాడు అంటాడు శ్రీనివాస్. ఆయన చేసిన మంచి పని మొత్తం మీరు షేర్స్ అమ్మడం వల్ల నాశనం అవుతుంది సార్. కంపెనీ మూతపడుతుంది అంటుంది తులసి. సామ్రాట్ కజిన్ ఎవరో సీఈవో అవుతున్నారని తెలిసి షేర్స్ అమ్మేద్దామని అనుకున్నాను. నువ్వు సీఈవో అవుతున్నావని తెలిసి నేను ఎలా అమ్ముతాను.. నో వే అంటాడు శ్రీనివాస్. మీరు ఇచ్చిన మాట తప్పుతారా అంటే.. మంచి జరుగుతుందని భావించినప్పుడు ఖచ్చితంగా మాట తప్పినా పర్వాలేదు అంటాడు శ్రీనివాస్. దీంతో ఆర్కే వెళ్లిపోతాడు. షేర్స్ అమ్మను అని శ్రీనివాస్ చెప్పడంతో తులసి చాలా సంతోషిస్తుంది.

Intinti Gruhalakshmi 17 Nov Today Episode : చాలా సంతోషంగా ఉన్న తులసి

మరోవైపు అంబులెన్స్ కోసం దీపక్ వెయిట్ చేస్తూ ఉంటాడు దీపక్. కానీ.. డాక్టర్లు చెక్ చేసి అప్పటికే సరస్వతి చనిపోయిందని చెబుతారు డాక్టర్లు. దీంతో దీపక్ కు ఏం చేయాలో అర్థం కాదు. సరస్వతిని చూసి ఏడుస్తూ ఉంటాడు. మరోవైపు తులసి చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు. సీఈవో అయ్యాక నేను సాధించిన మొదటి విజయం అంటుంది తులసి. కంపెనీ వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడగలిగాను అంటుంది తులసి.

మరోవైపు లే అమ్మ.. అంటూ ఏడుస్తూ ఉంటాడు దీపక్. ఇంతలో పరందామయ్య, అనసూయ అక్కడికి వస్తారు. ఎలాగైనా తులసికి ఈరోజు తన మనసులోని మాట చెప్పాలని నందు అనుకుంటాడు. తన వాళ్లు ఎవ్వరు ఫోన్ చేసినా డిస్టర్బ్ అవుతుందని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెడతాడు నందు. తన అమ్మ చనిపోయిన విషయం కూడా తులసికి తెలియదు.

మరోవైపు ఇంటికి తీసుకొచ్చి సరస్వతిని పడుకోబెడతారు. అందరూ ఏడుస్తుంటారు. ఇంకోవైపు తులసిని క్యాండిల్ లైట్ డిన్నర్ కు తీసుకెళ్తాడు నందు. గుండెల్లో బరువు మోయడం ఇక నావల్ల కాదు తులసి. నా మనసులో మాట చెబుతాను అంటాడు నందు. దీంతో నా మనసులో కూడా ఒక మాట ఉంది చెప్పనా అంటుంది తులసి.

లైఫ్ లో నాకు దొరికిన సంతోషం కంటే పోగొట్టుకున్న సంతోషమే ఎక్కువ అంటుంది తులసి. ఊపిరి పీల్చడం లాగే బాధపడటం కూడా నాకు అలవాటే అంటుంది తులసి. నా జీవితంలో ఒక భాగం అయిపోయింది అంటుంది తులసి. ఎందుకో ఈ మధ్యే మనసు కాస్త ప్రశాంతంగా ఉంది అంటుంది తులసి. ఒకప్పటి నందగోపాల్ లా కాకుండా మీరు కొత్తగా అనిపిస్తున్నారు. కొత్తగా ప్రవర్తిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది అంటుంది తులసి. మన మధ్య స్నేహబంధమే మంచిగా వర్కవుట్ అవుతోంది.

మన స్నేహ బంధాన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అంటుంది తులసి. దీంతో నందు తన మనసులో మాటను చెప్పలేకపోతాడు. ఆ తర్వాత తెల్లారేసరికి ఇంటికి వస్తారు నందు, తులసి. రాగానే మీ అమ్మ గారు చనిపోయారు అనే విషయం రాములమ్మ చెబుతుంది. మరోవైపు తనకు దీపక్ అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటాడు. తన చితికి నిప్పు పెట్టగానే అప్పుడే తులసి అక్కడికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది