Intinti Gruhalakshmi 18 Dec Today Episode : పరందామయ్య సేఫేనా? విక్రమ్ ను చంపేందుకు రాజ్యలక్ష్మి ప్లాన్. అది విన్న దివ్య ఏం చేస్తుంది? ఇంతలో ట్విస్ట్ ఏంటంటే? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Intinti Gruhalakshmi 18 Dec Today Episode : పరందామయ్య సేఫేనా? విక్రమ్ ను చంపేందుకు రాజ్యలక్ష్మి ప్లాన్. అది విన్న దివ్య ఏం చేస్తుంది? ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?

Intinti Gruhalakshmi 18 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 18 డిసెంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1130 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్య ప్రవర్తనలో తేడా ఉన్న మాట ఒప్పుకుంటాను కానీ.. దాన్ని ఇంతలా భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. పుట్టింటి వాళ్లు సారె ఇవ్వడానికి వచ్చినప్పుడు దివ్య చాలా డిస్టర్బ్ అయింది. అప్పటి నుంచి దివ్య ఇలా చేస్తుంది అంటాడు […]

 Authored By gatla | The Telugu News | Updated on :18 December 2023,8:00 am

ప్రధానాంశాలు:

  •  దివ్య చాలా డిస్టర్బ్ అయిందన్న విక్రమ్

  •  పరందామయ్యను ఆసుపత్రిలో చేర్పించిన తులసి, నందు

  •  బసవయ్య, సంజయ్ మరో ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Intinti Gruhalakshmi 18 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 18 డిసెంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1130 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్య ప్రవర్తనలో తేడా ఉన్న మాట ఒప్పుకుంటాను కానీ.. దాన్ని ఇంతలా భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. పుట్టింటి వాళ్లు సారె ఇవ్వడానికి వచ్చినప్పుడు దివ్య చాలా డిస్టర్బ్ అయింది. అప్పటి నుంచి దివ్య ఇలా చేస్తుంది అంటాడు విక్రమ్. దీంతో అవునా.. దివ్య బాధలో ఉంటే మాకు బాధగానే ఉంటుంది. తనను ఎవ్వరూ ఇబ్బంది పెట్టొద్దు. మీరు కూడా నోరు జారి ఏం అనకండి. దివ్య నువ్వు నీ సమస్య నుంచి కోలుకోవడమే మాకు కావాలి. సారీ దివ్య. నీ మనసు బాధపెట్టాను. నువ్వు రెస్ట్ తీసుకో. ఈరోజు ఇంటి పని నేను చూసుకుంటాను అంటుంది రాజ్యలక్ష్మి. దీంతో దివ్య అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది. మరోవైపు తులసి డాబా మీద బట్టలు ఎండేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి నందు వస్తాడు. నాన్న గారి గురించి మాట్లాడటానికి వచ్చాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటాడు నందు. మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థం కావడం లేదు అంటుంది తులసి. ఆయన్ను మనం చూసుకోగలమా? నువ్వు ఆఫీసుకు వెళ్తావు. నేను ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి. ఇంట్లో అమ్మ మాత్రమే ఉంటుంది. ఆమె మాత్రం ఎంతకని చూసుకుంటుంది. ఆమె ఆరోగ్యం అంతంత మాత్రం అంటాడు నందు. ఇవన్నీ పక్కన పెడదాం. నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి. తిరిగి నాతో జీవితం పంచుకోవాలి అనే ఆలోచన మీ మనసులో ఎప్పుడు పుట్టింది అని అడుగుతుంది తులసి.

లాస్యకు డైవర్స్ ఇచ్చినప్పటి నుంచే కదా అంటుంది తులసి. అప్పటి నుంచి ఆ విషయం నాకు చెప్పాలని నాన్ స్టాప్ గా మొన్నటి వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మా అమ్మ చావు రూపంలో ఎదురుదెబ్బ తగలకపోయి ఉంటే ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉండేవారు అంతే కదా. మీకు ఇష్టం అయినది సాధించడం కోసం సంవత్సరాలు అయినా ప్రయత్నిస్తారు. దాని కోసం ఎంత దూరం అయినా వెళ్తారు. ఏమైనా చేస్తారు కానీ.. జబ్బుతో ఉన్న తండ్రిని చూసుకునే విషయంలో నాలుగు రోజుల్లోనే అలసిపోయారు. ఓపిక అయిపోయింది. భయమేస్తోంది అంటున్నారు. ఎందుకలా. మీకు మామయ్య ఆరోగ్యం కంటే మీ స్వార్థం ముఖ్యం అంతేనా అంటుంది తులసి. మా నాన్నను చూసుకోనని నేను అన్నానా అంటాడు నందు. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ ఎందుకు నా ముందు బిక్కమొహం పెట్టారు. మామయ్య ఆరోగ్య పరిస్థితి ముందు ముందు ఎలా ఉండబోతుందో డాక్టర్ గారు పూర్తిగా చెప్పారు. ఆయన కష్టాన్ని, బాధ్యతను మోయాల్సిన బాధ్యత మనదే. దానికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యాం కూడా అంటుంది తులసి. దీంతో కాదని నేను అనలేదు అంటాడు నందు. నా నుంచి మీరు ఏం కావాలని ఇవన్నీ చెబుతున్నారు అంటుంది తులసి. ఒక కొడుకుగా ఆయనకు మీరు తోడుగా ఉండాలి. బాధ్యత మోయాలి. నా ముందుకు వచ్చి బాధపడితే ఉపయోగం లేదు. మామయ్య గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారో.. నాకు తెలియదు అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 18 Dec Today Episode : దివ్యను ఇరికించేందుకు మరో ప్లాన్ వేసిన బసవయ్య

మరోవైపు పరందామయ్య కింద పడిపోయి ఉంటాడు. అతడిని చూసి షాక్ అవుతుంది అనసూయ. ఇంతలో నందు, తులసి వస్తారు. ఏమైందో అనుకుంటారు. ఆయన్ను లేపి కూర్చోబెట్టి మంచినీళ్లు తాగిస్తారు. మరోవైపు దివ్య పని చేస్తూ ఉంటుంది. ఇంతలో తాతయ్య వచ్చి ఈ పనులన్నీ నువ్వు చేయాలా అని అడుగుతాడు. ఇదివరకు నేనే చేశాను కదా. ఇప్పుడు ఎందుకు చేయకూడదు అని అడుగుతుంది. దీంతో అప్పుడు నీ పరిస్థితి వేరు.. ఇప్పుడు నీ పరిస్థితి వేరు అంటాడు తాతయ్య. నాకేం కాలేదు తాతయ్య. ఎందుకు ఇలా నన్ను విచిత్రంగా చూస్తున్నారు అంటుంది. ఇంతలో విక్రమ్ వస్తాడు. ఏమైనా ప్రాబ్లమా దివ్య అంటే.. ఏం లేదు. ఊరికే మాట్లాడుకుంటున్నాం అంటాడు. నేను హాస్పిటల్ కు వెళ్లి వస్తా అంటే.. నేను కూడా హాస్పిటల్ కు వస్తా అంటుంది దివ్య. ఇంతలో రాజ్యలక్ష్మి, బసవయ్య అందరూ వస్తారు.

మరోవైపు డాక్టర్ వచ్చి పరందామయ్యను చెక్ చేస్తాడు. బీపీ పెరిగింది. చాలా సీరియస్ అంటాడు డాక్టర్. వెంటనే హాస్పిటల్ కు తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది కానీ.. లేకపోతే హార్ట్ ఎటాక్ వచ్చే చాన్స్ ఉంది అంటాడు డాక్టర్. కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నా ఆయన మీకు దక్కరు అంటాడు డాక్టర్. మరోవైపు సంజయ్, బసవయ్య మరో ప్లాన్ స్టార్ట్ చేస్తారు. దివ్య వింటుందని తెలిసినా కూడా ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఇంట్లో నాకు స్వతంత్రం లేదు. ప్రతి వాళ్లు నా మీద దౌర్జన్యం చేసేవాళ్లే. వెయ్యి రూపాయలు కావాలంటే ముష్టి అడుక్కోవాలి. హాస్పిటల్ కు వెళ్లాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి. దివ్య కూడా నా మీద పెత్తనం చెలాయిస్తోంది. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతాను. నా బతుకు నేను బతుకుతాను అంటాడు సంజయ్.

ఆ విక్రమ్ గాడిని పైకి పంపడానికి అక్కయ్య ముహూర్తం పెట్టింది. వాడు హాస్పిటల్ కు వెళ్లాడు. ఇక ప్రాణాలతో తిరిగి రాడు. ఇక నిశ్చింతగా ఉండు. ఈ మాట ఎవ్వరితో అనకు. దివ్యకు తెలిసిందంటే ప్లాన్ అంతా తలకిందులు అవుతుంది అంటాడు బసవయ్య. దీంతో దివ్య వెంటనే పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. పైకి వెళ్లి చూస్తే వాళ్లు ఉండరు. వెంటనే విక్రమ్ కు కాల్ చేస్తుంది.

పరందామయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లి ఇంటికి తీసుకొస్తారు. తప్పు నా వల్లే జరిగింది అంటుంది అనసూయ. తప్పు నాదే అనుకోండి. వదిలేయండి. ఎదుటి మనిషి మనసు అర్థం చేసుకోలేని చేతకాని దాన్ని అనుకోండి.. అని అంటుంది తులసి. ఎందుకు మీరు నా జోలికి వస్తున్నరు. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అంటుంది. మరోవైపు విక్రమ్ ప్రమాదంలో ఉన్నాడని చెప్పకుండా బయటికి వచ్చాను అంటుంది దివ్య. విక్రమ్ ప్రమాదంలో ఉన్నాడని నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది రాజ్యలక్ష్మి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక