Sudigali Sudheer : హీరోయిన్స్ తో లిప్ లాక్స్, రొమాన్స్ చేయనని తేల్చి చెప్పిన సుడిగాలి సుధీర్ .. కారణం ఏమై ఉంటుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudigali Sudheer : హీరోయిన్స్ తో లిప్ లాక్స్, రొమాన్స్ చేయనని తేల్చి చెప్పిన సుడిగాలి సుధీర్ .. కారణం ఏమై ఉంటుంది..!

 Authored By anusha | The Telugu News | Updated on :10 January 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Sudigali Sudheer : హీరోయిన్స్ తో లిప్ లాక్స్, రొమాన్స్ చేయనని తేల్చి చెప్పిన సుడిగాలి సుధీర్ .. కారణం ఏమై ఉంటుంది..!

Sudigali Sudheer : బుల్లితెర మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ సుడిగాలి సుధీర్ ఫుల్ పాపులరిటీని సంపాదించుకున్నారు. ఆ క్రేజ్ తోనే ఇప్పుడు వెండితెరపై వరుస సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. అలాగే జబర్దస్త్ షో ద్వారా చాలామంది కమెడియన్స్ వెండితెరపై కనిపిస్తున్నారు. కొందరు హీరోలుగా, కమెడియన్స్ గా, దర్శకులుగా మారారు. ఈ షో చేసిన వాళ్లలో 90 శాతం మంది ఏదో ఒక రకంగా లైఫ్ లో సెటిల్ అయ్యారు. ఇక హీరోగా సెట్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ ప్రధానంగా ఉంటారు. వెండితెరపై వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోగా రాణిస్తున్నారు. జబర్దస్త్ షోలో తనదైన కామెడీతో కమెడియన్గా అలరించారు. యాంకర్ రష్మితో కలిసి స్టేజ్ పై కెమిస్ట్రీ పలికిస్తు బుల్లితెరపై సూపర్ జోడిగా బాగా పాపులర్ అయ్యారు. రియల్ లైఫ్ లో కూడా వీళ్ళిద్దరూ కలవాలని ఫ్యాన్స్ కోరుకునేలా ఈ ఇద్దరు కలిసి ఫ్యాన్ బేస్ ఏర్పడేలా ఈ జోడి పాపులర్ కావడం, ప్రేక్షకులలోకి వెళ్లడం విశేషం.

ఇక వెండితెరపై వరుస సినిమా అవకాశాలు రావడంతో సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కి పూర్తిగా గుడ్ బై చెప్పేసారు. ఇప్పటికే హీరోగా సాఫ్ట్ వేర్ సుధీర్ , గాలోడు సినిమాలతో మెప్పించారు. ఇటీవల కాలింగ్ సహస్ర అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే సుధీర్ మాత్రం సినిమాల్లో ఓ నియమాన్ని పాటిస్తున్నారు. తన సినిమాలో హీరోయిన్ తో లిప్ లాక్, రొమాన్స్ సీన్లు ఉండవద్దని ఆయన భావిస్తున్నారు. సినిమాలు చేసే దర్శకులకు కూడా అదే విషయాన్ని ముందుగా చెబుతున్నారు. ఆమధ్య ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ..తన సినిమాలో లిప్ లాక్ లు, రొమాన్స్ సీన్లు ఉండవని చెప్పారు. వాటికి తాను దూరంగా ఉంటానని వెల్లడించారు.

కచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తానని సుడిగాలి సుధీర్ చెప్పారు. సాధ్యమైనంత వరకు ఇది ఫాలో అవుతానని అన్నారు. అయితే దానికి కారణం ఏంటనేది అందరూ ఆరా తీస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు. సుధీర్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అమ్మాయిలు, మహిళలతో సహా పెద్ద వాళ్ళు కూడా ఆయనను ఇష్టపడతారు. టీవీ షోస్ ద్వారా జనాల్లోకి వెళ్లారు. దీంతో తన సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారు. ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని అందరూ తన సినిమాను చూడాలని ఆయన చెబుతున్నారు. దీనికి మించి మరో కారణం కూడా ఉంది. అమ్మాయిలు ఆడవాళ్లంటే తనకు గౌరవం అని, వారిని తక్కువగా చేసి చూడటం కానీ, వారిని అసభ్యంగా చూడటానికి తాను ఒప్పుకోనని, వాళ్ళని గౌరవంగా చూడాలని, తన సినిమాలో ఆ రెస్పెక్ట్ ఉండాలని తాను కోరుకుంటానని, అందుకే లిప్ లాక్, రొమాన్స్ సీన్లకు దూరంగా ఉంటానని సుధీర్ చెప్పుకొచ్చారు.

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది