Bigg Boss Telugu 7 : యావర్‌ను పిచ్చోడు అన్న శోభాశెట్టి.. రెచ్చిపోయిన యావర్.. మితిమీరుతున్న శోభా ఓవర్ యాక్షన్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది తనేనా?
ప్రధానాంశాలు:
భోలే, ప్రియాంక మధ్య ఫైట్
యావర్, శోభా మధ్య బిగ్ ఫైట్
శోభా, రతిక మధ్య బిగ్ ఫైట్
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌస్ లో అంతా బాగానే ఉంది కానీ… ఒక్క హౌస్ మెంట్ విషయంలోనే హౌస్ మొత్తం సఫర్ అవుతోంది. అది హౌస్ మెట్స్ కి కూడా తెలుస్తోంది కానీ.. ఎవ్వరూ ఏం చేయలేకపోతున్నారు. స్టార్ మా బ్యాచ్ కూడా ఆ కంటెస్టెంట్ వల్లనే సఫర్ అవుతోంది. ఆమె ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకు కూడా తనను చూస్తేనే చిరాకు వేస్తోంది. ఆమె శోభా శెట్టి. తెలుగు బుల్లితెర మీద మోనితగా పరిచయం అయిన శోభాశెట్టి ఇప్పటికీ అదే క్యారెక్టర్ లో ఉండిపోయింది. ఏమాత్రం తేడా లేదు తనకు, ఆ క్యారెక్టర్ కు. మరి.. ఆ సీరియల్ డైరెక్టర్ తన క్యారెక్టర్ తెలుసుకొని ఆ క్యారెక్టర్ ఇచ్చాడా ఏంటో తెలియదు కానీ.. మోనిత క్యారెక్టర్ కంటే కూడా డేంజర్ క్యారెక్టర్ ఈ అసలైన శోభాశెట్టిది అని ప్రేక్షకులు తలలు బాదుకుంటున్నారు. ఎవరు తనను ఏమన్నా అస్సలు ఓర్చుకోదు. వెంటనే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. నిన్న ప్రియాంకతో కూడా ఏదో విషయంలో గొడవ పెట్టుకుంది. తేజతో అయితే ప్రతిరోజూ గొడవే. గొడవ పెట్టేసుకోవడం.. ఆ తర్వాత వెళ్లి సారీ చెప్పడం. ప్రియాంక, అమర్, తేజ అంటే శోభా శెట్టి ఏం అన్నా పడుతున్నారు కానీ.. మిగితా కంటెస్టెంట్లకు పడాల్సిన అవసరం లేదు కదా.
అసలు శోభాతో మాట్లాడాలంటేనే భయమేస్తోంది అని ఇటీవలే మాస్టర్ సందీప్ కూడా చెప్పాడు అంటే.. శోభా ప్రవర్తన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేను ఓటమిని తీసుకోలేను.. అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చిన శోభ.. నిన్న అర్జున్ కెప్టెన్సీ టాస్క్ లో శోభా పేరు చెప్పకపోయేసరికి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. మళ్లీ చివర్లో తన పేరు చెప్పేసరికి వెళ్లి అర్జున్ ను హగ్ చేసుకుంది శోభా శెట్టి. ఇక.. కెప్టెన్సీ కోసం సెలెక్ట్ అయిన కంటెండర్లు ప్రశాంత్, శోభా శెట్టి, ప్రియాంక, గౌతమ్, సందీప్ మాస్టర్.. వీళ్లలో కెప్టెన్ కు ఎవరు అర్హులు కారూ మిగితా కంటెస్టెంట్లు చెప్పాలని.. వాళ్ల మెడలో ఎండు మిర్చి దండలు వేయాలని చెబుతాడు బిగ్ బాస్. ఎక్కువ దండలు వచ్చిన వాళ్లు కంటెండర్ పోటీ నుంచి తప్పుకుంటారని చెబుతాడు బిగ్ బాస్. అమర్ దీప్ వెంటనే ప్రశాంత్ కు వేస్తాడు. భోలే.. ప్రియాంకకు వేస్తాడు. యావర్ వెళ్లి శోభా శెట్టికి వేస్తాడు. శోభా శెట్టి.. తీసుకోలేకపోతుంది. రతిక కూడా శోభా శెట్టికి వేయడంతో అస్సలు తీసుకోలేకపోతుంది.
Bigg Boss Telugu 7 : యావర్ పై రెచ్చిపోయిన శోభా
యావర్ కూడా శోభా శెట్టికే దండ వేస్తాడు. నీలాగా బక్వాస్ రీజన్ ఇవ్వను. కానీ ఇస్తా. నీలాగా నాకు కూడా అవకాశం వస్తుంది. అప్పుడు నువ్వు ఇక్కడ నిలుచుంటావు. అప్పుడు ఇస్తాను అని చెబుతుంది శోభా శెట్టి. దీంతో ఇచ్చేయ్ నో ప్రాబ్లమ్ అంటాడు యావర్. దీంతో పిచ్చోడు అంటుంది యావర్ ని. దీంతో నన్ను పిచ్చోడు అంటావా అని ఆ దండను నేలకేసి కొడతాడు యావర్. శోభా దగ్గరికి వెళ్లి సీరియస్ అవుతాడు. తనపై గట్టిగా అరుస్తాడు. పిచ్చోడినా నేను అంటే ఎస్ అంటుంది శోభా శెట్టి. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మొత్తానికి వచ్చే వారం గౌతమ్ కెప్టెన్ అయ్యాడు. ఇక.. ఈ వారం శోభా శెట్టి లేదా సందీప్ మాస్టర్ ఇద్దరిలో ఒకరిని బయటికి పంపిస్తాం అని ప్రేక్షకులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. చూడాలి మరి ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో?
