Viral Video : పబ్లిక్ లో అందరూ చూస్తుండగా ఈ అమ్మాయి ఏం పని చేసిందో చూడండి.. వైరల్ వీడియో..!!
Viral Video : ఈ మధ్యకాలంలో మనిషి రూపాన్ని చూసి మనిషికి గౌరవం ఇస్తున్నారు. చూడడానికి మంచి లుక్ తో ఉంటే చాలు వారి దగ్గరికి వెళ్లి పలకరిస్తున్నారు. ఒకవేళ చూడడానికి వికారంగా ఉంటే దూరం పెడుతున్నారు. కానీ కొంతమంది మంచి హోదాలో ఉన్న వ్యక్తులు కూడా సామాన్య వ్యక్తుల్లా ఉంటున్నారు. ఓ వృద్దుడు రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న కారు దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయాలి అనుకోగా ఆ డోర్ పై ఏమో మరకలు కనిపించడంతో తన కర్చీఫ్ తో తూడవడం ప్రారంభించాడు. అయితే అతడు చూడటానికి మామూలు వ్యక్తిగానే ఉన్నాడు.
పైగా టక్ , బూట్లు ధరించి నిండు గడ్డంతో కనిపించాడు. అయితే అదే సమయంలో ఇద్దరు అమ్మాయిలు అక్కడికి వచ్చి కారుని చూసి ఫిదా అయ్యి కారును తాకుతూ ఉంటారు. కారుతో సెల్ఫీ దిగటానికి ఆయనను పక్కకు జరగమని అంటారు. ఇక ఆయన ఏమీ అనకుండా పక్కకు జరిగి చేతులు కట్టుకొని చూస్తుంటారు. అయితే వారు ఫోటో దిగుతుండగా ఆయన ఫోటో ప్రేమ్ లోకి వస్తున్నాడని ఒక అమ్మాయి అతడిపై గట్టిగా అరుస్తుంది. అయినా కూడా ఆయన ఏమీ అనుకుండా సైలెంట్ గా ఉండిపోయారు. అమ్మాయిలు ఫోటోలు దిగుతూనే ఉంటారు. అయితే ఆయన కారు దగ్గరకు వెళుతుండగా అమ్మాయి అతడిని నెట్టి వేస్తుంది.
అప్పటికి ఆయన ఆమెతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుండగా వెంటనే ఆ కారు డ్రైవర్ వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చి కారు డోరుని తీసి ఆయనను కూర్చో పెట్టి అమ్మాయిలపై అరుస్తూ ఉంటాడు. కానీ ఆ వృద్ధుడు వాళ్లను ఏమీ అనవద్దు అంటుంటారు. ఇక కారు డ్రైవర్ కార్ కి ఓనర్ అని చెప్పడంతో అమ్మాయిలు షాక్ అవుతారు. ఇక అమ్మాయిలు ఆ వృద్ధుడికి సారీ చెప్పి ఆయనతో సెల్ఫీ తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్లు అతడికి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పరిశి రూపాన్ని చూసి అంచనా వేయడం ఏమాత్రం సరికాదు అని జనాలు కామెంట్లు చేస్తున్నారు.
![YouTube video](https://i.ytimg.com/vi/fPijZGO6qdo/hqdefault.jpg)