Viral Video : ముసలావిడే కానీ అదరగొట్టేసిందిగా.. వీడియో అదుర్స్..!
Viral video : సోషల్ మీడియాలో ఎవరు ఎలా ట్రెండ్ అవుతారో ఎవరికీ తెలియదు. నిన్నటి దాకా సాధారణంగా ఉన్న వ్యక్తులు కూడా సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రి పెద్ద స్టార్లు అయిపోతుంటారు. అయితే సోషల్ మీడియాలో ట్యాలెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది. పదిమందిలో ఒకరిలా కాకుండా.. పది మంది వేరు, తాము వేరు అనేలా ఎవరు ఏం చేసినా జనాలు వాళ్లను ఆదరిస్తూ ఉంటారు. తాజాగా ఓ ముసలావిడ డ్యాన్స్ […]
Viral video : సోషల్ మీడియాలో ఎవరు ఎలా ట్రెండ్ అవుతారో ఎవరికీ తెలియదు. నిన్నటి దాకా సాధారణంగా ఉన్న వ్యక్తులు కూడా సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రి పెద్ద స్టార్లు అయిపోతుంటారు. అయితే సోషల్ మీడియాలో ట్యాలెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది. పదిమందిలో ఒకరిలా కాకుండా.. పది మంది వేరు, తాము వేరు అనేలా ఎవరు ఏం చేసినా జనాలు వాళ్లను ఆదరిస్తూ ఉంటారు. తాజాగా ఓ ముసలావిడ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
దళపతి విజయ్ కి వీరాభిమాని అయిన ఓ బామ్మ సోషల్ మీడియాను దున్నేస్తోంది. ఇప్పుడు ఈ బామ్మ సోషల్ మీడియా సెలబ్రెటీగా మారింది. విజయ్ తాజాగా చేసిన ‘బీస్ట్’ సినిమాలోని ‘అరబిక్ కుతు’ పాటకు ముసలావిడ అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంది. విజయ్ అరబిక్ కుతు పాటకు ఏ స్టెప్పులు అయితే వేశాడో అవే స్టెప్పులను ముసలావిడ కూడా వేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అయితే ఈ డ్యాన్సింగ్ వీడియోని మామూలుగా కాకుండా ఓ థీమ్ తో చేసింది. తాను కూడా విజయ్ లాగా అదరగొట్టాలని.. అందుకు ఓ డ్యాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్లి, స్టెప్స్ నేర్చుకున్నట్లు సీన్ క్రియేట్ చేశారు.
Viral video : అరబిక్ కుతు పాటకు
డ్యా్న్స్ స్టెప్పులు నేర్చుకొని ముసలావిడ అదరగొట్టగా.. అందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. ముసలావిడ చూడానికే వయసు ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఆమెకు ఇంకా వయసు పెరగలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వయసులోనే ఇంతలా స్టెప్పులు వేసిందంటే. . ఆ వయసులో బామ్మ అదరగొట్టేసి ఉంటుందని మరికొందరు కామెంట్ చేశారు. హీరోయిన్ ఛాన్స్ కోసం బామ్మ చూస్తుందేమో అంటూ కొంతమంది ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా బామ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ సెలబ్రెటీగా మారిపోయింది.