Viral Video : చిన్న సీసాలో ప్రకృతిని బందించిన దృశ్యం.. వీడియో
Viral Video : పెయింటింగ్ వేయడం ఒక అద్బుతమైన కళ. ఎంతో మంది చిత్రవిచిత్రంగా పెయింటింగ్ వేసి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఒక్కరు ఒక్కో స్పెషాలిటీతో ఆకట్టుకుంటున్నారు. కొంతమంది చూడగానే బొమ్మ గీసి చేతిలో పెడతారు. మరికొందరు కొంచెం టైమ్ ఇస్తూ అద్బుతంగా గీసి చూపిస్తారు. కొంతమంది వాల్స్ పై.. మరికొంత మంది కాన్వాస్ పై.. కొంతమంది షీట్స్ పై ఇలా అద్బుతమైన పెయింటింగ్ వేస్తూ ఆకట్టుకుంటారు. చూడగానే ఆకట్టుకునే విధంగా అచ్చం నిజమైన ఆకృతి అక్కడుందా..? అనేలా వేస్తారు.
ఎంతో మంది చరిత్రకారులు తమ పెయింటింగ్ తో అద్బుతాలు సృష్టించారు. చాలా తక్కువ మంది పెయింటింగ్ ఆర్టిస్ట్ లకు ఈ ఘనత దక్కుతుంది. కొంతమంది అతి సూక్ష్మంగా బొమ్మలు వేసి ఆకట్టుకుంటారు. ఒక పెయింటింగ్ ఎన్నో అర్థాలను చెపుతుంది. అది చూసే విధానం బట్టి ఉంటుంది. ఒక్కో చిత్రంలో ఒక లైఫ్ కనబడుతుంది. అందుకే రాజా రవి వర్మ పెయింటింగ్స్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. కొన్ని పెయింటింగ్ లో అమ్మ ప్రేమ.. పల్లెటూరి వాతావరణం కనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటు పోతే పెయింటింగ్ అద్దులు లేవు..
అయితే కొంతమంది డిఫరెంట్ గా ఆలోచిస్తూ పెయింటింగ్ చిన్న చిన్న గాజు సీసాల్లో వేస్తూ ఆకట్టుకుంటున్నారు. చిన్న వేలు కూడా దూరని సిసాలో అద్బుతమైన పెయింటింగ్ వేస్తూ ప్రకృతిని మొత్తం అందులోనే చూపించాడు ఓ పెయింటర్. చిన్న నెయిల్ పాలీష్ లాంటి గాజు సీసాలో చిన్న బ్రష్ తో అద్బుతాన్ని ఆవిష్కరించాడు. ఆ చిన్న సీసాలో సెలయేరు, చెట్లు, అందమైన ఇల్లు ఇలా ప్రకృతి మొత్తం అందులో బందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram