AP : ఏపీలో దారుణం పరిస్థితి బురద నీళ్లు తాగుతున్నారు.. రోడ్డుకు అడ్డంగా పడుకున్న యువకుడు.. వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP : ఏపీలో దారుణం పరిస్థితి బురద నీళ్లు తాగుతున్నారు.. రోడ్డుకు అడ్డంగా పడుకున్న యువకుడు.. వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :24 July 2023,11:00 am

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నట్లు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ తెగ గొప్పలు చెప్పుకుంటుంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలలో దాదాపు 90 శాతం అమలు చేసినట్లు వైసీపీ ప్రజా ప్రతినిధులు మైకులు ముందు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అక్కడి వాస్తవ పరిస్థితులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏకంగా నీళ్లు లేని పరిస్థితులలో జనాలు అక్కడ ఉన్నారు. అల్లూరి జిల్లా ముంచింగ్ ఫుట్ మండలం కోడగడు గ్రామంలో గిరిజనులు.. త్రాగునీరు లేక బురద నీటిని తాగుతున్నారు. ఇటీవల వర్షాలు అధికంగా పడటంతో తాగడానికి మంచినీరు వసతి లేక వరదలోని బురద నీరు.. మంచినీటిగా త్రాగుతున్నారు. ఈ క్రమంలో మంచినీటి సౌకర్యం కల్పించాలని గిరిజన తెగ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అంత మాత్రమే కాదు ఉంటున్న నివాసాల నుండి… కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ పొలాలలో.. దిగి మరి అక్కడి బురద నీరును గిరిజనులు తాగే పరిస్థితి నెలకొంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ప్రజల వద్దకు చేరిందని నేతలు చెప్పుకుంటున్నారు. కానీ కనీసం మంచినీరు కూడా ఇచ్చే పరిస్థితులలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉండటం పట్ల సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒక్క మంచినీరు విషయంలో మాత్రమే కాదు ఏపీలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఎప్పటినుండో రాష్ట్ర ప్రభుత్వం ఇదిగో అదిగో రోడ్లు వేసేస్తున్నామని ప్రకటనలు చేస్తున్నయి తప్ప… అసలు పని మొదలు పెట్టడం లేదు. దీంతో ఏపీ వాసులు రోడ్ల విషయంలో అనేక అవస్థలు పడుతున్నారు. గట్టిగా రెండు మూడు రోజులు వర్షం పడిందంటే… గుంతలు పడిన రోడ్లలో వర్షపు నీరు చేరుకొని.. రోడ్డు మొత్తం గోతులుగా మారిపోతున్నాయి. దీంతో అనేకమంది వాహనాదారులు.. ప్రమాదాలకు గురై కాళ్లు చేతులు విరగ్గొట్టుకుంటున్నారు.

andhra pradesh infrastructure bad there is no water and roads bad

andhra pradesh infrastructure bad there is no water and roads bad

కనీస మౌలిక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కల్పించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుండి బయటకు వెళ్తే మళ్లీ తిరిగి ఇంటికి.. క్షేమంగా రావటం అనుమానమే అన్న రీతిలో ఏపీలో రోడ్లు మారాయని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రజలకు ఒక బటన్ నొక్కి డబ్బులు అందించడం వల్ల కొద్దిగా మేలు జరుగుతున్నా గాని.. ప్రజలకు అత్యవసరమైన మంచినీళ్లు మరియు రోడ్లు సరిగా లేకపోతే.. ఉపయోగమేమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికైనా రోడ్లు విషయంలో త్వరితగితన చర్యలు చేపట్టాలని.. కొత్త రోడ్లు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో.. అసలే అధ్వానంగా ఉన్న రోడ్లు ఇప్పుడు మరి గుంతలుగా మారాయి. ఈ క్రమంలో వాటి వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఏలూరు నగరంలో రోడ్లు పరిస్థితి మరి అధ్వానంగా ఉండటంతో.. అక్కడి తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్ద ఓ యువకుడు ఆర్టీసీ బస్సుకి అడ్డంగా మంచం వేసుకొని.. నిరసన తెలియజేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది