Bride : పెళ్లి వేదికపై వధువు ఆ పని చేసేలోపే వరుడు ఆ పనికానిచేసాడు.. వీడియో వైరల్ !
ప్రధానాంశాలు:
పెళ్లి వేదికపై వరుడు చేసిన పనికి పెళ్లి కూతురు షాక్..
Bride : పెళ్లి వేదికపై వధువు ఆ పని చేసేలోపే వరుడు ఆ పనికానిచేసాడు.. వీడియో వైరల్ !
Bride : పెళ్లి వేడుకల్లో ఊహించని సంఘటనలు, నవ్వులు తెప్పించే ఘటనలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వరుడు చేసిన సరదా చేష్టలు నెటిజన్ల మనసు గెలుచుకున్నాయి. పెళ్లి వేడుకలో భాగంగా జరిగిన రసగుల్లా తినిపించే సమయంలో, వరుడు తన హావభావాలతో అందరినీ అలరించాడు. ఈ వీడియో చూసిన వారంతా అతన్ని ‘టెన్షన్ లేని వరుడు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు…

Bride : పెళ్లి వేదికపై వధువు ఆ పని చేసేలోపే వరుడు ఆ పనికానిచేసాడు.. వీడియో వైరల్ !
Bride : పెళ్లి వేదికపై వరుడు చేసిన పనికి కదుపుచెక్కలయ్యేలా నవ్వుకున్న వధువు.. !
వైరల్ అవుతున్న వీడియోలో వధువు తన చేతులతో వరుడికి రసగుల్లా తినిపించగా, అతను నవ్వుతూ స్వీటును స్వీకరించాడు. కానీ వరుడి వంతు రాగానే, అతను కూడా రసగుల్లా తీసి వధువుకు తినిపించబోతాడు. అయితే వధువు కొంచెం ఆలస్యం చేయడంతో, అప్పటివరకు ఆగలేక వరుడు రసగుల్లాను తానే గుటుక్కున తింటాడు. ఇది చూసి వధువు తెగ నవ్వేసింది. కేవలం వధువే కాదు పెళ్లి వేడుకకు వచ్చిన వారంతా ఈ ఘటన చూసి తెగ నవ్వుకున్నారు.
ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు. “అహంకారంగా ఉండే వరుల కంటే ఇలా సరదాగా ఉండే వరుడు మిలియన్ రెట్లు బెటర్”, “ఇతనితో జీవితం ఆనందంగా ఉంటుంది”, “అంతే ఈ అమ్మాయి నవ్వుతూ జీవించబోతోంది” అంటూ కామెంట్లు పెడుతూ ఈ వీడియో ను షేర్ చేస్తున్నారు.
View this post on Instagram