Viral Video : పెంపుడు ఎలుగుబంటి.. ఓనర్ పక్కన కూర్చొని ఫుడ్ తింటూ ఇది చేసిన రచ్చ చూడండి
Viral Video : సాధారణంగా ఎవరైనా కుక్కలు, పిల్లులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. కానీ.. ఎలుగుబంట్లను ఎవరైనా పెంచుకుంటారా? కానీ.. ఈయన చూడండి.. ఏకంగా ఎలుగుబంటినే పెంపుడు జంతువుగా పెంచుకుంటున్నాడు.దాన్ని పెంచుకోవడమే కాదు.. దాన్ని ఏకంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకొని తనతో పాటు ఫుడ్ తినిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఓనర్ తో పాటు డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లలో పెట్టిన ఫుడ్ ను ఒక్కొక్కటిగా ఆరగించింది ఎలుగుబంటి. అంతే కాదు.. ఎదురుగా టీవీ పెట్టుకొని..కార్టూన్ ప్రోగ్రామ్ చూస్తూ ఏంచక్కా ఫుడ్ ను ఆరగించింది ఎలుగుబంటి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు అయితే నవ్వకుండా ఉండలేకపోతున్నారు.

bear eating food with man while watching cartoon video viral
Viral Video : కార్టూన్ చూస్తూ ఫుడ్ ఆరగించిన ఎలుగుబంటి
ఏంటి.. దాన్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకొని ఫుడ్ తినడం ఏంటి.. అది కార్టూన్ ప్రోగ్రామ్ చూడటం ఏంటి.. అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేసుకోండి.
https://twitter.com/guldurbakalim/status/1469403967838990348?s=20