Viral Video : బుల్లెట్ బండి సాంగ్‌కు డ్యాన్స్ అదరగొట్టిన పెళ్లి కూతురు.. వీడియో

Advertisement

Viral Video : పెళ్లి అన‌గానే ఈ రోజుల్లో ముందుగా గుర్తుకు వ‌చ్చేది ఏంటంటే.. వ‌ధూవ‌రుల డ్యాన్స్. నెట్టింట్లో వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోల సంద‌డి చూస్తే తెలుస్తోంది ఎంత క్రేజ్ ఉందో.. పెళ్లికొడుకు పెళ్లి కూతురు పోటీ ప‌డుతూ మాస్ డ్యాన్స్ చేస్తూ కేక‌పెట్టిస్తున్నారు. ఇది వ‌ర‌కు వ‌ధూవ‌రుల ఫ్రెండ్స్, బంధువులు డ్యాన్స్ చేసే వారు.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. అంద‌రినీ సైడ్ చేసి ఏకంగా మండ‌పంలోనే డ్యాన్స్ చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. పెళ్లి ప‌నులు స్టార్ట్ అయింది మొద‌లు ఫొటో షూట్స్.. డ్యాన్స్ వీడియో.. సంగీత్, బ‌రాత్, రిసెప్ష‌న్ వేదిక ఏదైనా డ్యాన్స్ మాత్రం త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే..

Advertisement

సాధార‌ణంగానే అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. ఇక చాన్స్ దొరికితే అస్స‌లు వ‌ద‌ల‌రు.. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో రీసెంట్ వెడ్డింగ్ వీడియోలు ప్లానింగ్ తో తీస్తున్నారు. కావ‌ల్సిన ఏర్పాట్లు అన్నీ వెడ్డింగ్ ప్లాన‌ర్ తో చేయించుకుని భారీగా సెట‌ప్ క్రియేట్ చేస్తున్నారు. కోలాటం.. గ్రూప్ డ్యాన్స్… అంటూ తెగ సంద‌డి చేస్తున్నారు. ఇక పెళ్లి కూత‌రు ఎంట్రీ డ్యాన్స్ కి ప్ర‌త్యేకంగా ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లి కూత‌రు వెన‌కాల సేమ్ క్యాస్టుమ్ ధ‌రించిన గ్రూప్ డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ అద‌రిపోయేలా చేస్తున్నారు. ఇక ప్ర‌తి పెళ్లీలో వినిపించే సాంగ్ నీ బుల్లెట్టు బండెక్కి..

Advertisement
Bride wedding dance video of youtube
Bride wedding dance video of youtube

పెళ్లి కూతురు వెడ్డింగ్ డ్యాన్స్ తోనే ఈ సాంగ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్ర‌తి పెళ్లిలో పెళ్లి కూత‌రు ఈ సాంగ్ కి స్టెప్పులు వేస్తూ పార్ట్ న‌ర్ కి త‌మ ఫీలింగ్స్ ని తెలియ‌జేస్తున్నారు. ప్ర‌స్తుతం పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తున్న వెడ్డింగ్ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. నీ బుల్లెట్టు బండెక్కి… సాంగ్ కి స్టెప్పులు వేస్తూ పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తోంది. కోలాటం ఆడుతూ గ్రూప్ గా భారీ సెట‌ప్ ని ఏర్పాటు చేశారు. బంధువులు, ఫ్రెండ్స్ మ‌ధ్య డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంది. ప‌ల్ల‌కిలో ఊరేగుతూ చిరున‌వ్వులు చిందించింది. దీంతో పెళ్లి కొడుకు ఇంప్రెస్ అయి ఖుషీ అయ్యాడు

Advertisement
Advertisement