Viral Video : ఇది కేరింగ్ అంటే.. ఈ రెండు పిల్లులు తమ ఆహారాన్ని ఏం చేశాయో తెలిస్తే కంటతడి పెట్టాల్సిందే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ఇది కేరింగ్ అంటే.. ఈ రెండు పిల్లులు తమ ఆహారాన్ని ఏం చేశాయో తెలిస్తే కంటతడి పెట్టాల్సిందే

 Authored By jagadesh | The Telugu News | Updated on :12 December 2021,4:20 pm

Viral Video : కేరింగ్ ఈజ్ షేరింగ్ అని చాలామంది చెబుతుంటారు. నిజమే.. మీకు ఎవరి మీద అయినా ప్రేమ ఉందంటే.. ఖచ్చితంగా వాళ్ల కోసం ఏదైనా చేస్తారు. కొందరైతే తమకు నచ్చిన వాళ్ల కోసం.. తమ వాళ్ల కోసం ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడతారు. అది నిజమైన ప్రేమ అంటే. అది కేవలం మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ ఉంటుంది.అవును.. మనుషుల మధ్యనే ప్రేమ ఉండదు. అన్ని జీవాల్లోనూ ప్రేమ ఉంటుంది. ప్రేమకు కులాలు, మతాలు ఎలా అడ్డు ఉండవో..

ప్రపంచంలోని ఈ జీవాలన్నింటిలోనూ ప్రేమ ఉంటుంది. అది తన తోటి జంతువు మీద ప్రేమ చూపిస్తుంది. దాని కోసం ఏదైనా చేస్తుంది. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది రెండు పిల్లులకు సంబంధించిన వీడియో. రెండు పిల్లులు.. ఒకే కప్పులో ఉన్న ఆహారాన్ని ఎలా షేర్ చేసుకుంటూ తింటున్నాయో చూస్తే షాక్ అవ్వాల్సిందే.

caring is sharing of cats Viral Video

caring is sharing of cats Viral Video

Viral Video : రెండు పిల్లలు ఫుడ్ షేర్ చేసుకున్న వీడియో వైరల్

కొందరైతే.. తమ ప్లేట్ ఉన్న ఒక్క అన్న మెతుకును కూడా ఇంకొకరికి ఇవ్వరు. కానీ.. ఈ పిల్లులు.. ఒకే కప్పులో ఉన్న ఆహారాన్ని.. షేర్ చేసుకున్నాయి. నేను ఒక్కదాన్నే తినేస్తా అని ఏ పిల్లి అనుకోలేదు. ఒక పిల్లి కొంత సేపు తిని.. తర్వాత ఆ కప్పును ఇంకో పిల్లికి ఇవ్వడం.. ఇలా రెండూ షేర్ చేసుకొని తినడాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నరు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది