Viral Video : మోదీ నీకు సిగ్గుందా.. ప్రధానిని ఏకిపారేసిన మహిళా కాంగ్రెస్ నేత.. ఎందుకో తెలుసా?
Viral Video : ప్రధాన మంత్రి సిగ్గుపడాలి.. అంటూ యూపీకి చెందిన మహిళా కాంగ్రెస్ నేత సుప్రియా శ్రినాటె మండిపడ్డారు. అయితే.. ఆమె అంతలా ప్రధాని మోదీని ఏకిపారేయడానికి కారణం ఉంది. గత కొన్ని రోజుల నుంచి మణిపూర్ లో అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే కదా. పోలీసు బలగాలు కూడా ఆ దుండగులను ఏం చేయలేకపోతున్నాయి. దీంతో దుండగులు రెచ్చిపోతున్నారు. చివరకు మహిళలను వివస్త్రలను చేసి అత్యాచారాలు చేసి రోడ్ల మీద ఊరేగిస్తున్నారు.
అలా.. కొందరు మహిళలను వివస్త్రలను చేసి రోడ్ల మీద ఊరేగించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. అసలు మణిపూర్ లో జరుగుతున్న విధ్వంస కాండ మీకు కనిపించడం లేదా అని ప్రతిపక్షాలు.. కేంద్రంపై మండిపడుతున్నాయి. ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ విరుచుకుపడుతున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ మహిళా నేత సుప్రియ ఓ వీడియో విడుదల చేశారు. అందులో ప్రధానిని ఏకిపారేశారు.పార్లమెంట్ సెషన్ లో మోదీ 8 నిమిషాల 25 సెకన్లు మాట్లాడితే అందులో మణిపూర్ కోసం కేవలం 36 సెకన్లు మాత్రమే మాట్లాడారు. మన దేశ ప్రధాన మంత్రి ఒక పిరికివాడు. ఆ వీడియో చూశాక కూడా 36 సెకన్లు మాత్రమే మాట్లాడటం దౌర్భాగ్యం. ఈ క్రూరత్వానికి వీడియోలో కనిపిస్తున్న నీచులు ఎంత బాధ్యులో మీరు కూడా అంతే బాధ్యులు. మీరు 3 నెలల క్రితమే పందించి ఉంటే ఈరోజు దేశం మీ మీద ఇలా విరుచుకుపడేది కాదు.
Viral Video : పార్లమెంట్ లో ఆ ఘటనపై మాట్లాడేంత టైమ్ కూడా లేదా మోదీ?
స్మృతి ఇరానీ నువ్వు 77 రోజుల తర్వాత నిద్రలేచావా? మీడియా మిత్రులు మీరే గనుక ప్రధాన మంత్రిని ముందే ప్రశ్నించి ఉంటే.. ఈరోజపపు దేశప్రజలు తిరగబడేవారు కాదు. ఏమయ్యా ప్రధాన మంత్రి నీకు బాధగా ఉందా? మాకు నీలో ఎలాంటి బాధ కనిపించడం లేదు. మాకు కనిపిస్తున్నది ఆ మహిళలు, వాళ్లను హింసించిన నీచులు. నువ్వు ప్రపంచం మొత్తం షికార్లు చేస్తున్నావు. మణిపూర్ స్త్రీలను నువ్వు క్షమాపణ అడగాలి. దేశంలో ఉన్న ప్రతి స్త్రీని నువ్వు ఈరోజు క్షమాపణ అడగాలి. ఈ వీడియో చూశాక దేశంలోని ప్రతి స్త్రీ భయపడుతోంది. సిగ్గుండాలి. నువ్వు 140 కోట్ల మందికి ప్రధాని అవ్వడం మా దౌర్భాగ్యం.. అంటూ ఆ మహిళా నేత ప్రధాన మంత్రిపై విరుచుకుపడ్డారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మణిపూర్ లో మహిళలను వివస్త్రను చేసి హింసిస్తుంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ?
మహిళలకు రక్షణ కల్పించలేని ప్రధాని ఉండడం మన దౌర్భాగ్యం….#BJP #Modi #ManipurViolence #manipurriots #SupriyaShrinate #Congress pic.twitter.com/ynOmUaT3bG— Aapanna Hastham (@AapannaHastham) July 20, 2023