Viral Video : తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. మనిషిపై నెమలి దాడి..?
Viral Video: ప్రకృతిలోతల్లిప్రేమఅనేది ఒకే రకంగా ఉంటుంది. అది మనుషుల్లో అయినాజంతువుల్లోనైనా కామన్.ఇతరులు ఎవరైనా తమకు హాని తలపెట్టాలని చూస్తే జంతువులు లేదా పక్షులు భరిస్తాయేమో కానీ తమ సంతానం జోలికి వస్తే అస్సలు భరించవు. అది సాటి వన్యప్రాణులను చంపి తినే మృగం అయినా కావొచ్చు. సాదు జంతువైనా కావొచ్చు. ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం ఏదైనా ఉందంటే అది మదర్ లవ్. దీనికి మించిన త్యాగం మరెక్కడా, ఎందులోనూ దొరకదు. సాధారణంగా తల్లి ప్రేమ అంటే అందరూ మనిషి రూపంలో చూస్తుంటారు. తల్లి తాను తినకున్నా బిడ్డల కడుపు నింపేందుకు ఎంతో శ్రమిస్తుంది. పిల్లల కడుపు నిండితే తన కడుపు నిండనంత సంతోషిస్తుంది. కానీ తన పిల్లల జోలికి వేస్తే ఏ తల్లి సహించదు.
సాధారణంగా మన చుట్టూ ఉన్న పెట్స్ లేదా పక్షులను చూస్తూనే ఉంటాం. అవి తమకు సంతానం కలిగిన సమయంలో వాటి యజమానులను కూడా ఒక్కోసారి దగ్గరకు రానివ్వవు. వారి వలన తమ పిల్లలకు ఏమైనా అవుతుందేమో అని వాటి భయం. అందుకు తమకు రోజు తిండి పెట్టి పెంచుకుంటున్న వారిని కూడా దగ్గరకు రానివ్వవు. కుక్కలు, పిల్లులు, కోడి వంటివి తమ సంతానం విషయంలో చాలా కేరింగ్‌గా ఉంటాయి. ముఖ్యంగా కోడి విషయానికొస్తే చాలా చిన్న పక్షి. గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చాక పిల్లులు, ఈగల్స్ నుంచి తన పిల్లలను రక్షించేందుకు ఎంతో శ్రమిస్తుంది. వాటి మీద దాడి చేసేందుకు కూడా సిద్ధపడుతుంది.

evidence of mothers love peacock attack on man
Viral Video : గుడ్లు దొంగిలిస్తున్నాడని..
నెమలి కూడా కోడి లాగే పక్షి జాతికి చెందినది. ఇది కూడా తన సంతానాన్ని రక్షించునేందుకు ఎంతో శ్రమిస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టంట వైరల్ అవుతోంది. పొలంలో నెమలి తన గుడ్లపై పొదిగి ఉండగా.. ఓ వ్యక్తి వచ్చి నెమలిని పక్కకు విసిరేసి దాని గుడ్లను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. వెంటనే తల్లి నెమలి అతని మీదకు దూకి దాడి చేయడంతో కిందపడిపోతాడు. ఒక ఎగ్ కూడా కిందపడిపోతుంది. దీంతో ఆ వ్యక్తి ఆ గుడ్లను అక్కడే పెట్టేసి వెళ్లిపోతాడు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన వారంతా తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram