Viral Video : మరీ రోడ్లపైనా … పబ్లిక్ లో బైక్ పై లవర్స్ పాడు పనులు.. వీడియో
Viral Video : ప్రస్తుతం యువతకు ప్రాణాలంటే లెక్కలేదు.. వాళ్లకి ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తారు. కిక్కు కోసం ఎంతకైనా తెగిస్తారు. కొందరు ఫెమస్ అవడానికి ఏమైనా చేస్తారు. కొందరు బైకులు గాల్లోకి లేపుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందపడతారు. మరికొందరు లవర్స్ తో రేసుల్లో పాల్గొంటారు. పక్కన అమ్మాయి ఉందంటే ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. అయితే కొంత మంది లవర్స్ ఎక్కడ ఏం చేయాలో తెలియకుండా ప్రవర్తిస్తారు. పక్కన అమ్మాయి ఉంటే చాలు ఏం చేస్తున్నారో కూడా వాళ్లకి తెలియదు. ఎవరు ఏం అనుకుంటారో అని కూడా పట్టించుకోరు…. అమ్మాయిలు కూడా అదే రేంజ్ లో సపోర్ట్ చేస్తున్నారు.,,
అమ్మాయి బైక్ ఎక్కితే నాలుగు వంకలు తిప్పుతూ బిల్డప్ ఇస్తుంటారు. మరికొందరు నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులు రోడ్లపైనే అన్ని కానిచ్చేస్తున్నారు. పబ్లిక్ లో ఏం చేయాలో ఏం చేయకూడదో.. అసలు ఇదంతా తెలిసి చేస్తారో తెలియక చేస్తారో వాళ్లకే తెలియాలి. ఇలాంటి వాళ్లు ఒకరు చెప్తే వినే స్టేజ్ లో కూడా ఉండరు. సినిమాల ప్రభావమో.. పేరెంట్స్ పెంపకమో అర్థం కాదు. రోడ్లమీదే రెచ్చిపోతున్నారు. ఇదేం అంటే ఫ్యాషన్.. కల్చర్ ట్రెండింగ్ అంటూ సమాధానం చెప్తుంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సీన్ ఒకటి మనకు దర్శనమిస్తోంది…
ఇక్కడ అబ్బాయి బైక్ నడుపుతుండగా బైక్ పై అమ్మాయి ఎదురుగా హత్తుకుని కూర్చుంది. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో హీరోయిన్ బైక్ పై వెళ్తూ ముద్దు పెట్టుకుంటారు… అలా ఇక్కడా అదే సీన్ రిపీట్ చేస్తున్నారు. ఇద్దరూ గదిలో చేయాల్సిన పనులు ప్రేమపేరుతో నడిరోడ్డులో హత్తుకుని ముద్దులు పెట్టుకుంటున్నారు. ఇదంతా రోడ్డు పై వెళ్లేవారికి ఇబ్బందిగా ఉంటుందనే కామన్ సెన్స్ కూడా లేకుండా పోయింది. ఓ సమయం సందర్భం లేకుండా ఎక్కడపడితే అక్కడా రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. మీరు కూడా చూసి వాళ్లకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి…