Viral Video : వీళ్ల డ్యాన్స్ చూస్తూ ఎవ్వ‌రైనా షాక్ అవ్వాల్సిందే.. కొత్త జంట పోటీ ప‌డుతూ ఊర‌మాస్ డ్యాన్స్..

 Authored By mallesh | The Telugu News | Updated on :16 June 2022,2:00 pm

Viral Video : పెళ్లంటే ఇదివ‌ర‌కు పెళ్లి కూతురు సిగ్గుప‌డుతూ మండ‌పంలో త‌ల దించుకుని కూర్చునేది.. కానీ ఇప్పుడు ట్రండ్ మార్చారు. ఎంత మంది ఉన్నా ఎలాంటి జంకు లేకుండా ఎంతో జోష్ తో డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. పెళ్లి చూపుల్లో అమ్మాయి ఏం చ‌దువుకుంది అని అడిగే బ‌దులు.. అమ్మాయికి ఏ సాంగ్స్ పై డ్యాన్స్ వ‌చ్చు.. అని అడిగేలా అంత‌లా మార్చారు అమ్మాయిలు త‌మ టాలెంట్ తో.. పెళ్లిలో పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తేనే సంద‌డిగా ఉంటోంది. ఫ్రెండ్స్ , ఫ్యామిలీ మెంబ‌ర్స్ కూడా ఎంక‌రేజ్ చేస్తున్నారు.

పెళ్లికి ముందే అన్ని ప్లాన్ చేసుకుని త‌మ సంతోషాల‌ను అంద‌రితో పంచుకుంటున్నారు.ఇక బంజారా పెళ్లీల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి.. పెళ్లిలో డ్యాన్స్ ట్రెండింగ్ కాక‌ముందు నుంచే వాళ్లు ఎప్ప‌టినుంచో డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేసేవారు. ఇంట్లో ఎలాంటి ఫంక్ష‌న్ జ‌రిగినా ఇంటిల్లిపాది క‌లిసి డ్యాన్స్ చేస్తూ హంగ‌మా చేస్తారు. ఇక పెళ్లిలో అయితే ఆ సంద‌డి మామూలుగా ఉండ‌దు.. వారంరోజుల‌పాటు డ్యాన్స్ చేస్తూ చుట్టూ ఉన్న వాళ్లు వీడియోలు తీస్తూ ఎంక‌రేజ్ చేస్తారు. ఆడ మ‌గ‌.. చిన్నా పెద్దా తేడా లేకుండా డ్యాన్స్ తో కుమ్మేస్తారు.

Wedding New Couple Mass Dance Video Viral

New Couple Wedding Mass Dance Video Viral

ప్ర‌స్తుతం ఓ కొత్త‌జంట బ‌రాత్ లో ఆరుబ‌య‌ట మాస్ డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. చుట్టూ జనం చేరి వీడియోలు తీస్తుండ‌గా ఊర‌మాస్ స్టెప్పుల‌తో దుమ్ములేపుతున్నారు. పెళ్లికూతురు.. పెళ్లి కొడుకు ఎక్కడ త‌గ్గ‌కుండా పోటీప‌డుతూ మ‌రీ ఒక‌రినిఒక‌రు చూసుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు. బంజారా, తెలుగు డీజే సాంగ్స్ కి మంచి ఊపులో ఇర‌గ‌దీస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేసి ఎంజాయ్ చేయండి….

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి